పుట్టినరోజు నాడు అనసూయ దాతృత్వం.. అభినందించిన పోలీసులు..!

బుల్లితెర యాంకర్, నటి అనసూయ ఇటీవల తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సందర్బంగా కుటుంబంతో అనసూయ పుట్టినరోజును జరుపుకోగా..

  • Tv9 Telugu
  • Publish Date - 5:40 pm, Sat, 16 May 20
పుట్టినరోజు నాడు అనసూయ దాతృత్వం.. అభినందించిన పోలీసులు..!

బుల్లితెర యాంకర్, నటి అనసూయ ఇటీవల తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సందర్బంగా కుటుంబంతో అనసూయ పుట్టినరోజును జరుపుకోగా.. సోషల్ మీడియాలో ఆమెకు అభిమానులు విషెస్ చెప్పారు. కాగా పుట్టినరోజు సందర్భంగా గర్భిణీలకు చేయూతగా నిలిచారు అనసూయ. శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్‌ పరిధిలోని వంద మంది గర్భిణీలకు రాగి పౌడర్, ఇనుము అధికంగా ఉండే ఎండు కర్జూరం, పాలు, గుడ్లు, పండ్లతో కూడిన పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనసూయను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అభినందించారు. కాగా గత కొన్నిరోజులుగా స్టేషన్‌ల వారీగా గర్భిణీలను గుర్తించిన రాచకొండ పోలీసులు వారికి పౌష్టికాహారం అందిస్తున్నారు.

Read This Story Also: కరోనాపై పోరు.. ‘క్యూర్’ దొరికింది..!