చెర్రీ నుంచి తీసుకున్న అప్పును తీర్చలేదు: పవన్
మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. వరుసకు తామిద్దరం బాబాయి- అబ్బాయిలం అయినప్పటికీ.. అన్నాదమ్ముల్లా ఉంటామని పవన్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. వరుసకు తామిద్దరం బాబాయి- అబ్బాయిలం అయినప్పటికీ.. అన్నాదమ్ముల్లా ఉంటామని పవన్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాగా ఖుషీ వరకు పవన్, చెర్రీ దగ్గర అప్పు తీసుకునేవారట. అప్పటివరకు తీసుకున్న డబ్బును తిరిగి వెనక్కి ఇవ్వలేదట. ఈ విషయాన్ని పవన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఆ ఇంటర్వ్యూ ఇప్పటిది కాదు.
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిరుత చిత్రం ద్వారా రామ్ చరణ్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చేసిన పలు ప్రమోషన్లలో చరణ్‌తో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అందులో చిరు, పవన్ గురించి మాట్లాడుతూ.. పవన్ సాధారణంగా చెర్రీ దగ్గర డబ్బులు అప్పు చేస్తూ ఉంటాడు అని అన్నారు. దానికి పవన్ స్పందిస్తూ.. ”చెర్రీ దగ్గర అప్పు చేయడానికి నేనేం ఇబ్బందిగా ఫీల్ అవ్వను. నాకు డబ్బులు కావాలనుకుంటే ఎవ్వరి దగ్గరైనా అప్పు చేస్తా. చెర్రీ దగ్గర డబ్బులు తీసుకున్న ప్రతి సారి నెక్ట్స్ మూవీ చేసిన తరువాత నీ అప్పును వడ్డీతో సహా తీరుస్తా అని చెబుతూ ఉంటాను. ఖుషీ వరకు చెర్రీ దగ్గర డబ్బులు తీసుకున్నా. కానీ తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు చరణ్ టాలీవుడ్‌లో స్టార్ హీరో అవుతాడు కాబట్టి, అతడికి కచ్చితంగా ఇచ్చి తీరాలి” అని అన్నారు.
Read This Story Also: Breaking:సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ మళ్లీ వాయిదా..!



