కరోనాపై పోరు.. ‘క్యూర్’ దొరికింది..!

మానవ శరీర జన్యువుల్లోని కరోనా వైరస్ ప్రవేశించకుండా అడ్డుకునే యాంటీ బాడీస్‌ను కనుగొన్నామని అమెరికాలోని శాండియాగో నగరంలోని సొరెంటో థెరాప్యూటిక్స్‌ బయోటిక్‌ కంపెనీ ప్రకటన చేసింది. ఈ మందు ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఒకవేళ అనుమతి వస్తే రెండు లక్షల డోసుల చొప్పున యాంటీ బాడీని ఉత్పత్తి చేయగలమని ఆ కంపెనీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ యాంటీ బాడీకి క్యూర్ అని […]

కరోనాపై పోరు.. 'క్యూర్' దొరికింది..!
Follow us

| Edited By:

Updated on: May 16, 2020 | 5:18 PM

మానవ శరీర జన్యువుల్లోని కరోనా వైరస్ ప్రవేశించకుండా అడ్డుకునే యాంటీ బాడీస్‌ను కనుగొన్నామని అమెరికాలోని శాండియాగో నగరంలోని సొరెంటో థెరాప్యూటిక్స్‌ బయోటిక్‌ కంపెనీ ప్రకటన చేసింది. ఈ మందు ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఒకవేళ అనుమతి వస్తే రెండు లక్షల డోసుల చొప్పున యాంటీ బాడీని ఉత్పత్తి చేయగలమని ఆ కంపెనీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ యాంటీ బాడీకి క్యూర్ అని పేరును పెట్టినట్లు వారు వివరించారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ మందును వాడి వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చునని పేర్కొన్నారు. వంద శాతం ఇది పని చేస్తుందని వారు అన్నారు.

‘ఎస్‌టీఐ–1499’ యాంటీ బాడీస్‌తో తమ పరీక్ష విజయవంతమైందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ యాంటీ బాడీస్‌ను పరీక్షించేందుకు న్యూయార్క్‌లోని ఎంటీ సినాయ్‌ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో తాము ప్రయోగాలు చేసినట్లు వారు తెలిపారు. దీనిపై కంపనీ సీఈవో డాక్టర్ హెన్రీ జీ మాట్లాడుతూ.. ”కరోనాకు కచ్చితంగా మందు ఉంది. ల్యాబ్‌లో మానవ సెల్స్‌పై యాంటీ బాడీస్‌తో నిర్వహించిన పరీక్షలు మంచి ఫలితాలు వచ్చాయి. మానవ ట్రయల్స్‌ మాత్రం ఇంకా పరీక్షలు జరపలేదు” అని అన్నారు.

Read This Story Also: కరోనా లాక్‌డౌన్‌: బస్సు సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైన తొలి రాష్ట్రం