కరోనా లాక్‌డౌన్‌: బస్సు సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైన తొలి రాష్ట్రం

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ప్రజా రవాణా స్తంభించిన విషయం తెలిసిందే. అయితే మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్ 4.0 ప్రారంభం కానుండగా..

కరోనా లాక్‌డౌన్‌: బస్సు సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైన తొలి రాష్ట్రం
Follow us

| Edited By:

Updated on: May 16, 2020 | 5:12 PM

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ప్రజా రవాణా స్తంభించిన విషయం తెలిసిందే. అయితే మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్ 4.0 ప్రారంభం కానుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో బస్సు సేవలను ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది. దీనిపై హర్యానా పోలీస్‌ చీఫ్ మనోజ్ యాదవ్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఇప్పటికే చాలా మందిని పంపుతున్నాం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చిక్కుకుపోయిన ఇతర జిల్లావాసులను వారి స్వగ్రామానికి చేర్చాలని నిర్ణయించుకున్నాం. అందుకే అంతర్ జిల్లా బస్సు సేవలను ప్రారంభించాం అని పేర్కొన్నారు.

అయితే ఈ సందర్భంగా అక్కడి అధికారులు చాలా కఠిన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఒక్కసారి బస్సు ఎక్కితే గమ్య స్థానం వరకు ఎవరూ దిగకూడదని తెలిపారు. ఆన్‌లైన్‌లోనే టికెట్లను బుక్‌ చేసుకోవాలని.. 29 మార్గాల్లో బస్సు సేవలను ప్రారంభించామని అధికారులు వివరించారు. అలాగే 52 సీట్ల సామర్థ్యం ఉన్న బస్సుల్లో కేవలం 30 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి బస్సులను నడపాలనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల వలన

Read This Story Also: ఏపీ సీఎం జగన్‌కి తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క రిక్వెస్ట్..!