Mango 6

భోజనంతో పాటు మామిడి పండ్లు తినొచ్చా?

May 05, 2024

image

TV9 Telugu

Mango

TV9 Telugu

పండ్ల రారాజు మామిడిపండ్లను చూస్తే నోరూరని వారు దాదాపు ఉండరు. మామిడి రుచే వేరు. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేసే మామిడి పండ్లను సరైన పద్ధతిలో తినకపోతే లేనిపోని సమస్యలు వస్తాయి

మామిడి పండును తినటంలో కూడా సరైన పద్ధతి ఉంది. నిజానికి.. మామిడిపండ్ల మీద ఒకరకం ఫైటిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి తగిలితే అలర్జీ సంభవించి, దురద తలెత్తుతుంది

TV9 Telugu

మామిడి పండును తినటంలో కూడా సరైన పద్ధతి ఉంది. నిజానికి.. మామిడిపండ్ల మీద ఒకరకం ఫైటిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి తగిలితే అలర్జీ సంభవించి, దురద తలెత్తుతుంది

అందువల్ల తినేముందు మామిడికాయలను శుభ్రంగా కడగటం ముఖ్యం. తొడిమ వద్ద ఉండే సొన పూర్తిగా పోయేలా కడగాలి. ఇందుకోసం మామిడిపండ్లను నీటిలో కనీసం అరగంట సేపు నానబెట్టి, కడగటం మంచిది

TV9 Telugu

అందువల్ల తినేముందు మామిడికాయలను శుభ్రంగా కడగటం ముఖ్యం. తొడిమ వద్ద ఉండే సొన పూర్తిగా పోయేలా కడగాలి. ఇందుకోసం మామిడిపండ్లను నీటిలో కనీసం అరగంట సేపు నానబెట్టి, కడగటం మంచిది

TV9 Telugu

ఇలా చేయడం వల్ల మామిడిలో అధికంగా ఉన్న ఫైటిక్‌ ఆమ్లం తొలగిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం- భోజనంతో పాటు పండ్లను తినకూడదు. కానీ మామిడిపండ్లకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది

TV9 Telugu

మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి బలవర్ధకంగా పనిచేస్తుందట. పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకోకూడదు

TV9 Telugu

ముఖ్యంగా జీర్ణ సమస్యలు, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, సొరియాసిస్‌, ల్యూపస్‌ వంటి ఆటోఇమ్యూన్‌ జబ్బులు.. చర్మ సమస్యలన్నవారు మామిడిని పాలతో కలిపి తీసుకోకూడదు

TV9 Telugu

మామిడిలో యాంటీఆక్సిడెంట్ల గుణాలతో కూడిన గ్యాలటానిన్లు, మ్యాంగిఫెరిన్‌ వంటి వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. అందుకే తొక్కతో పాటు వీటిని తినాలి. ఎందుకంటే ఇవి తొక్క కిందే ఉంటాయట

TV9 Telugu

మామిడిలో విటమిన్‌ ఎ, సి దండిగా ఉంటాయి. ఇవి చర్మం బిగుతుగా ఉండటానికి తోడ్పడే కొలాజెన్‌ ఏర్పడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. చర్మం నిగనిగకూ తోడ్పడి, వృద్ధాప్య ఛాయలనూ తగ్గిస్తాయి