Telangana: ఆహా.. ఇది కదా కావాల్సింది.. రాష్ట్రంలో వచ్చే 5 రోజులు వర్షాలే

తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తోన్న వేళ హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకు కూల్ న్యూస్ అందించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Telangana: ఆహా.. ఇది కదా కావాల్సింది.. రాష్ట్రంలో వచ్చే 5 రోజులు వర్షాలే
AP Weather Report
Follow us

|

Updated on: May 05, 2024 | 7:11 PM

ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ కూల్ న్యూస్‌ చెప్పింది. రాగల ఐదు రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. మరో వైపు పలు జిల్లాల్లో వడగాలులు కొనసాగుతాయని పేర్కొంది. దాంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఆదివారం  ఖమ్మం, కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్‌ సూర్యాపేట, జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. సోమవారం ములుగు, భూపాలపల్లి,  కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌,  , మహబూబాబాద్‌, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి,  నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. అలాగే ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల,జగిత్యాల, నిర్మల్‌, కరీంనగర్‌,  రాజన్న సిరిసిల్ల,  పెద్దపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.

మంగళవారం భువనగిరి, సిద్దిపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.  ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

కాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆదివారం పలుచోట్ల వర్షం కురిసింది. జనగామ, ములుగు జిల్లాల్లో వడగళ్ల వాన పడింది.  ఏటూరు నాగారంలో పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు.  కోడూరులో పిడుగుపాటుతో రైతు అజయ్ మృత్యువాతపడ్డాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం