Portable AC: చిన్నగా ఉందని చీప్‌గా తీసిపారేయకండి.. ఐస్ క్యూబ్స్ వేశారంటే.. క్షణాల్లో మంచు కురుస్తుంది.!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనాలు తాళలేకపోతున్నారు. ప్రతీ చోటా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడిగాలికి, ఉక్కపోతకు చెమటలు కారుతుంటే.. ప్రజలందరూ కాసేపు కూలర్లు, ఏసీల ఆశ్రయిస్తే.. ఒంటిని చల్లబరుచుకుంటున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనాలు తాళలేకపోతున్నారు. ప్రతీ చోటా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడిగాలికి, ఉక్కపోతకు చెమటలు కారుతుంటే.. ప్రజలందరూ కాసేపు కూలర్లు, ఏసీల ఆశ్రయిస్తే.. ఒంటిని చల్లబరుచుకుంటున్నారు. అటు గంటల తరబడి ల్యాప్‌టాప్ మీద, సిస్టంపై పని చేసేవాళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మీ ముందుకు ఓ పోర్టబుల్ ఏసీ తీసుకొచ్చేశాం. బరువు తక్కువ.. ఎక్కడికైనా ఈజీగా తీసుకుని వెళ్లొచ్చు. మరి దాని ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.
ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో CTRL Portable AC అందుబాటులోకి వచ్చేసింది. ఒక్కసారి దీనిని ఆన్ చేసి కూర్చుంటే.. మీ చుట్టుప్రక్కల అంతా మంచు కురవాల్సిందే. దీని బరువు కేవలం 299 గ్రాములే. అలాగే 5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు. వాడేందుకు తేలిక.. ఫ్యాన్‌కు మూడు బ్లేడ్స్ కూడా ఉన్నాయి. మీ శరీరాన్ని, అలాగే గదిని చిటికెలో కూల్ చేస్తుంది. దీని నుంచి సౌండ్ తక్కువ వస్తుంది. అలాగే నైట్ లైట్ కూడా ఉంటుంది కాబట్టి.. మీకు ప్రశాంతమైన నిద్ర, అలాగే రూమ్ ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ ఎయిర్ కూలర్ 90శాతం దాకా కరెంటును ఆదా చేస్తుంది. దీని నుంచి వచ్చే ఎయిర్ ఫ్లో కంట్రోల్ చేసేందుకు 3 ఎయిర్ స్పీడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఈ కూలర్‌ను యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేయవచ్చు. ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్ అసలు ధర రూ. 2,499కాగా అమెజాన్ లో దీనిపై 49శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.1,265కే లభిస్తోంది.(Source)