AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు సంపాదించవచ్చు.!

వ్యాపారం అనగానే చాలా మంది సంకోచించేది లాభాలు వస్తాయో లేదో అని. కానీ సరైన ప్రణాళిక, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారం చేస్తే నష్టాలు అనే మాటే ఉండదు. మరీ ముఖ్యంగా సీజనల్‌ వ్యాపారాలు ప్రారంభిస్తే నష్టాలు తక్కువగా ఉంటాయి. మండే ఎండలు దంచికొడుతున్నాయి.

Business Ideas: మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు సంపాదించవచ్చు.!
Money Making Tips
Ravi Kiran
|

Updated on: May 06, 2024 | 5:30 PM

Share

వ్యాపారం అనగానే చాలా మంది సంకోచించేది లాభాలు వస్తాయో లేదో అని. కానీ సరైన ప్రణాళిక, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారం చేస్తే నష్టాలు అనే మాటే ఉండదు. మరీ ముఖ్యంగా సీజనల్‌ వ్యాపారాలు ప్రారంభిస్తే నష్టాలు తక్కువగా ఉంటాయి. మండే ఎండలు దంచికొడుతున్నాయి. జనాలు బయటకి రావాలంటేనే దడుసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సీజన్‌ను సరిగ్గా క్యాష్ చేసుకోవాలే కానీ.. మాంచి లాభాలు ఆర్జించవచ్చు. సమ్మర్‌లో బెస్ట్‌ బిజినెస్‌లో ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ ఒకటి. సమ్మర్‌లో ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టాలు తక్కువగా ఉంటాయి. లాభాలు ఎక్కువ ఉంటాయి. ఇంతకీ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయో.? చూద్దాం..

ఐస్‌క్రీమ్ పార్లర్లను ఆయా సంస్థలకు చెందిన ఫ్రాంచైజీలను తీసుకోవచ్చు. ఉదాహరణకు అమూల్‌, జర్సీ వంటి ఫ్రాంచైజ్‌లను తీసుకోవచ్చు. వీటితో పాటు పాల ఫ్రాంచైజీలను కూడా పొందొచ్చు. ఇందుకోసం ఆయా సంస్థలు నిర్ధేశించిన ధరను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు ఫ్రాంచైజీల్లో భాగంగానే ఫ్రిడ్జిలు సైతం అందిస్తాయి. అలాకాకుండా మీరు సొంతంగా కూడా ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇందులో అన్ని రకాల బ్రాండ్స్‌కు చెందిన ఐస్‌క్రీమ్‌లను అమ్ముకోవచ్చు. ఇక ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ను ఏర్పాటు చేయడానికి 300-400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఒక గది కావాల్సి ఉంటుంది. కనీసం 5 నుంచి 10 మంది కూర్చునేలా గది ఉండాలి. ఐస్‌క్రీమ్ పార్లర్‌ వ్యాపారం ప్రారంభించాలంటే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక లాభాల విషయానికొస్తే ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ ద్వారా తక్కువలో తక్కువ నెలకు రూ. 30 వేల వరకు ఆదాయం పొందొచ్చు.

Follow Us
ఇంటికి చుట్టాలొస్తే చకచకా 10 నిమిషాల్లో చేసే స్వీట్..
ఇంటికి చుట్టాలొస్తే చకచకా 10 నిమిషాల్లో చేసే స్వీట్..
Philips పార్టీ స్పీకర్ ధర, ఫీచర్లు తెలుసా
Philips పార్టీ స్పీకర్ ధర, ఫీచర్లు తెలుసా
వెల్లుల్లి కారం వేసి చికెన్ ఫ్రై ఇలా చేసారంటే.. పలావ్ రైస్ లోకి
వెల్లుల్లి కారం వేసి చికెన్ ఫ్రై ఇలా చేసారంటే.. పలావ్ రైస్ లోకి
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే వారం రోజుల్లో వీరికి వరాలే వరాలు
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే వారం రోజుల్లో వీరికి వరాలే వరాలు
అప్పులు ఇవ్వొద్దు జాగ్రత్త.. ఈ రాశి వారు డబ్బులు ఇస్తే తిరిగిరావు
అప్పులు ఇవ్వొద్దు జాగ్రత్త.. ఈ రాశి వారు డబ్బులు ఇస్తే తిరిగిరావు
విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..
రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..
సజ్జ పిండి, మెంతికూర ఉంటే చాలు.. టేస్టీ మిస్సీ రోటీలు రెడీ!
సజ్జ పిండి, మెంతికూర ఉంటే చాలు.. టేస్టీ మిస్సీ రోటీలు రెడీ!
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువీ చెత్త ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువీ చెత్త ప్రపంచ రికార్డు
సీఆర్‌పీఎఫ్‌ చారిత్రాత్మక రికార్డు.. 47 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సీఆర్‌పీఎఫ్‌ చారిత్రాత్మక రికార్డు.. 47 ఏళ్ల తర్వాత తొలిసారిగా..