Anil Kumar
నిర్మాతలే అలా చేసే వాళ్లు.. సోనాలి షాకింగ్ కామెంట్స్..
05 May 2024
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ట్రేండింగ్ లో ఉన్న ముద్దుగుమ్మల్లో హీరోయిన్ సోనాలి బింద్రే ఒకరు.
ఇక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొంది.. బాలీవుడ్ లో అడుగు పెట్టి వరస సినిమాలతో దూసుకుపోయింది సోనాలి.
ఆ తరువాత ఆరోగ్య సమస్యల కారణంగా చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఈ మధ్య వెబ్ సిరీస్ లు చేస్తుంది.
తాజాగా సోనాలి మాట్లాడుతూ.. అప్పట్లో ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పై వచ్చే రూమర్స్ పై తనదైన శైలిలో స్పందించారు.
ఓ సినిమా మొదలైంది మొదలు.. ఆ సినిమాలో హీరో - హీరోయిన్ మధ్య ఎఫైర్ ఉందంటూ.. వారు డేటింగ్‌లో ఉన్నారంటూ..
వార్తలు వస్తుంటాయి. అయితే ఆ వార్తలను పుట్టించేది ఎవరో కాదు.. ఆ సినిమా ప్రొడ్యూసర్లే అని చెప్పింది సోనాలి.
సినిమాలకు క్రేజ్ కోసం, ఫ్రీ పబ్లిసిటీ అయ్యేందుకు ఇలాంటి రూమర్స్‌ను కావాలనే ప్రొడ్యూసర్లు పుట్టిస్తున్నారని అన్నారు.
తన విషయంలో కూడా ఇలా జరిగిందని.. కానీ అందరూ లైట్ తీసుకుంటారని అన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి