‘అల’..రికార్డుల వరద..బన్నీ మార్క్ ట్రెండ్ సెట్…
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కలెక్షన్స్ పరంగా నాన్-బాహుబలి రికార్డ్స్ కొల్లగొట్టిన ఈ మూవీ తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తమన్ అందించిన స్వరాలు ఈ మూవీ రేంజ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆల్బమ్ తాజాగా 1 బిలియన్ వ్యూస్‌ను దక్కించుకుని యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ సోషల్‌మీడియా […]

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కలెక్షన్స్ పరంగా నాన్-బాహుబలి రికార్డ్స్ కొల్లగొట్టిన ఈ మూవీ తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తమన్ అందించిన స్వరాలు ఈ మూవీ రేంజ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆల్బమ్ తాజాగా 1 బిలియన్ వ్యూస్‌ను దక్కించుకుని యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ సోషల్‌మీడియా వేదికగా మ్యూజిక్ లవర్స్ కి స్పెషల్ థ్యాంక్స్ తెలపింది.
Thanks to each & every music lover for making our scintillating audio such a big success. #AVPLMusic
1 Billion music streams and counting on a single channel on @YouTubeIndia for #AlaVaikuntapurramuloo ❤️ @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman #1BillionStreamsForAVPL pic.twitter.com/fLqmgWg1wU
— Geetha Arts (@GeethaArts) May 15, 2020
“మా ఆల్బమ్‌ను ఇంత భారీ రేంజ్ లో హిట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ‘అల.. వైకుంఠపురములో’ ఆల్బమ్ యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని మరింత ముందుకెళ్తుంది. యాక్టర్స్, సింగర్స్, పాటల రచయితలు, ఇతర మూవీ యూనిట్ కి శుభాకాంక్షలు” అని గీతాఆర్ట్స్ ట్వీట్ చేసింది.
ఈ సినిమాలోని పాటలకు సెలబ్రిటీలు కూడా మెస్మరైజ్ అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కు టిక్‌టాక్ చేసి అదరగొట్టగా.. ఇటీవల అలనాటి తార సిమ్రాన్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ ‘బుట్టబొమ్ము’ స్టెప్పులతో ఆకట్టుకున్నారు.




