Anand Devarakonda: అన్నయ్యలా అతడు కూడా స్టార్ అవుతాడా.. వరుస సినిమాలతో దూసుకెళుతున్న యువ హీరో..
Anand Devarakonda: విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా
Anand Devarakonda: విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా ఆశించినంతగా గుర్తింపు తీసుకురాలేకపోయింది. దీంతో తదుపరి సినిమాగా వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్‌తో ఆనంద్ నటనను నిరూపించుకున్నాడు. టాలీవుడ్‌లో మొత్తానికి ఓ హిట్ సాధించాడు.
దీంతో ఆనంద్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అవినాష్ కోకాటి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ ఆనంద్‌కు బాగా నచ్చిందట. కాన్సెప్ట్ బేస్డ్ కథ కావడంతో, ఈ సినిమా గురించి ఆనంద్ దేవరకొండ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. ముఖ్యంగా కథలోని పాత్ర తనకు బాగా నచ్చిందట. మొత్తానికి ఆనంద్ ఏదో భిన్నమైన కథనే చేయబోతున్నాడన్నమాట. మరి తన అన్నయ్యలా తానూ కూడా స్టార్ అవుతాడేమో చూడాలి. ఇక ప్రస్తుతం ఆనంద్ మరో సినిమా షూట్‌లో బిజీగా ఉన్నాడు.
నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. 160 పరుగుల ఆధిక్యం.. అదరగొడుతున్న టీమిండియా బౌలర్లు..