Heroine Tabu: హ్యాక్ అయిన టబు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్.. ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయోద్దంటూ విజ్ఞప్తి…
Tabu Instagram Account Hacked: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోతోంది. తారలు తమ వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకోగలుగుతున్నారు. అయితే..
Tabu Instagram Account Hacked: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోతోంది. తారలు తమ వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకోగలుగుతున్నారు. అయితే సాంకేతికత పెరిగిన నేపథ్యంలోనే హ్యాకింగ్ ముప్పు కూడా పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురికావడం సర్వసాధారణంగా మారిపోయింది. సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ కొన్ని లింక్లను షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మంది తారలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్ టబు హ్యాకింగ్ బాధితురాలిగా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ గురైనట్లు గుర్తించిన టబు వెంటనే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. ‘హ్యాక్ అలర్ట్… నా అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. నా అకౌంట్‌ను నుంచి వచ్చే ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయకండి’ అంటూ కామెంట్ చేసింది.
Also Read: Ravi Teja Krack Movie : సాలిడ్ హిట్ కొట్టిన మాస్ రాజా.. ‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..