Today Gold Price: మరోసారి తగ్గిన బంగారం ధరలు… ఈసారి మాత్రం స్వల్ప తగ్గుదల.. 10 గ్రాముల గోల్డ్ ఎంత ఉందంటే..
Today Gold Price: లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం ఏకంగా రూ.500 వరకు తగ్గిన విషయం తెలిసిందే. ఈ తగ్గుదల సోమవారం కూడా కొనసాగింది. అయితే..
Today Gold Price: లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం ఏకంగా రూ.500 వరకు తగ్గిన విషయం తెలిసిందే. ఈ తగ్గుదల సోమవారం కూడా కొనసాగింది. అయితే ఆదివారంతో పోల్చితే ఇది చాలా స్వల్పతగ్గుదల అని చెప్పాలి. మరి సోమవారం దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తులం బంగారం ఎంత పలుకుతోందో చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 48,130 పలకగా.. 24 క్యారెట్లు రూ.51,500 గా ఉంది. (ఢిల్లీలో ఆదివారంతో పోల్చితే సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ఏకంగా రూ.1,010 తగ్గడం విశేషం). ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,900గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,490 ఉండగా.. (శనివారంతో పోలీస్తే కేవలం రూ.10 తగ్గింది). 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,630 గా నమోదైంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 45,490 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,630గా ఉంది. విశాఖపట్నంలోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 45,490 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్.. రూ.49,630గా పలికింది.