AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu: పరాజాయాలు ఎన్నో పాఠాలు నేర్పాయంటోన్న పి.వి సింధు.. కరోనా సమయంలో సింధు ఏం చేసిందంటే..

కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా ఇలా ప్రతీ రంగానికి చెందిన వారు ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ ప్రాక్టిస్‌, బ్యాడ్మింటన్‌ టూర్లతో బిజీగా గడిపే...

PV Sindhu: పరాజాయాలు ఎన్నో పాఠాలు నేర్పాయంటోన్న పి.వి సింధు.. కరోనా సమయంలో సింధు ఏం చేసిందంటే..
Narender Vaitla
|

Updated on: Jan 18, 2021 | 5:37 AM

Share

Sindhu About Her Losses: కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా ఇలా ప్రతీ రంగానికి చెందిన వారు ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ ప్రాక్టిస్‌, బ్యాడ్మింటన్‌ టూర్లతో బిజీగా గడిపే భారత స్టార్‌ షట్లర్‌ పి.వి సింధు కూడా గతేడాది ఇంటి పట్టునే ఉంది. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో తాను ఏం చేసిందో చెప్పుకొచ్చిందీ స్టార్‌ ప్లేయర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింధు ఈ విషయమై మాట్లాడుతూ.. ‘పరాజయాల నుంచి నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. గతేడాది ఎన్నో పాఠాలు నేర్పించింది. వీటిలో అన్నింటికంటే ముఖ్యమైంది సహనం. దీనికి కారణం ఏ టోర్నీలు లేకపోవడమే. ఈ సమయంలో మా కుటుంబంతో గడిపేందుకు సమయాన్ని కేటాయించాను. క్రీడాకారిణిగా మారిన తర్వాత ఇంత సమయం కుటుంబ సభ్యులతో గడపడం ఇదే తొలిసారి. ఈ సమయంలో తప్పులు దిద్దుకున్నాను. గతేడాది మార్చి-ఏప్రిల్‌ మధ్య ఒలింపిక్స్‌ సన్నద్ధతలో ఉన్నా. కానీ ఈ క్రీడలు వాయిదా పడడం ఎంతో నిరాశ కలిగించింది. అయితే ఇలా వాయిదా వల్ల నా తప్పులు దిద్దుకునే అవకాశం దొరికిందనే సానుకూల దృక్పథంతో ముందుకు సాగాను’ అని చెప్పుకొచ్చింది సింధు.

Also Read: ISL 2020-21: వరస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న ముంబైని కట్టడి చేసిన హైదరాబాద్ ఎఫ్‌సీ