AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amul Ponniyin: పొన్నియిన్‌ సెల్వన్‌ క్రేజ్‌ను భలే వాడేసుకున్నారుగా.. వైరల్‌ అవుతోన్న అమూల్‌ కార్టూన్‌..

మణిరత్నం దర్శకత్వంలో వచ్చి చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌-1'. అంత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం...

Amul Ponniyin: పొన్నియిన్‌ సెల్వన్‌ క్రేజ్‌ను భలే వాడేసుకున్నారుగా.. వైరల్‌ అవుతోన్న అమూల్‌ కార్టూన్‌..
Amul Ponniyan
Narender Vaitla
|

Updated on: Oct 03, 2022 | 8:24 AM

Share

మణిరత్నం దర్శకత్వంలో వచ్చి చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’. అంత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ ముందు వండర్స్ క్రియేట్ చేస్తోంది. అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది. మరీ ముఖ్యంగా తమిళనాట ఈ సినిమా రికార్డు వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. చియాన్ విక్రమ్‌, జయం రవి, కార్తీ.. అందాల తారలు ఐశ్వర్యా రాయ్‌, త్రిష వంటి భారీ తారాగణంలో వచ్చిన ఈ సినిమాకు తమిళనాట ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. ఈసినిమా రూ.150 కోట్ల గ్రాస్‌, రూ.75 కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో సెలవులు ఉండడంతో కలెక్షన్లు మరింత పెరగడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ తాజాగా పొన్నియిన్‌ సెల్వన్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడింది. సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలకు సంబంధించి కార్టూన్‌లను రూపొందిస్తూ తమ సంస్థ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసుకునే అమూల్‌.. పొన్నియిన్‌పై కూడా కార్టూన్‌ను రూపొంచింది. ఈ కార్టూన్‌లో విక్రమ్‌, ఐశ్వర్య, త్రిష, కార్తీలు అమూల్‌ బటర్‌తో బ్రెడ్‌ను తింటున్నట్లు డిజైన్‌ చేశారు. ఈ పిక్‌తో పాటు.. ‘పైసా వసూల్‌’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ఇక అమూల్‌ కార్టూన్‌ను నటి త్రిష కూడా తన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేయడం విశేషం.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..