హిట్ రీమేక్‌ ద్వారా తెలుగులోకి రీ ఎంట్రీ..?

ఇద్దరమ్మాయిలతో, నాయక్, బెజవాడ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కేరళ బ్యూటీ అమలాపాల్.. ప్రస్తుతం తమిళం, మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో చివరగా జెండాపై కపిరాజు సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత మూడు, నాలుగు డబ్బింగ్ మూవీల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉంటే తాజాగా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు అమలా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన హిట్ చిత్రం అసురన్‌ను తెలుగులో […]

హిట్ రీమేక్‌ ద్వారా తెలుగులోకి రీ ఎంట్రీ..?

ఇద్దరమ్మాయిలతో, నాయక్, బెజవాడ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కేరళ బ్యూటీ అమలాపాల్.. ప్రస్తుతం తమిళం, మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో చివరగా జెండాపై కపిరాజు సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత మూడు, నాలుగు డబ్బింగ్ మూవీల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉంటే తాజాగా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు అమలా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తమిళంలో ధనుష్ హీరోగా నటించిన హిట్ చిత్రం అసురన్‌ను తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ప్రియమణి నటిస్తోంది. తమిళ్‌లో మంజు వారియర్ నటించిన పాత్రలో ప్రియమణి కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా అమలాపాల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అమ్ము అభిరామి పాత్రకు గానూ అమలాను సంప్రదించగా.. ఆ ఆఫర్‌కు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

Published On - 4:59 pm, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu