అయిదో మొగుడు-ఆరో భార్య.. ఆ పెళ్లి కూడా పెటాకులే !

బేవాచ్‌ సీరియల్‌లో అందాలను ఆరబోసి యూత్‌ను కిర్రెక్కించిన పమేలా ఆండర్సన్‌ మొన్నీమధ్యనే ఓ పెళ్లి చేసుకుంది.. ఇదివరకే నలుగురిని పెళ్లి చేసుకుని … వాళ్లను వదిలించుకున్న పమేలాకు ఇది అయిదో పెళ్లి… అయిదోసారి ఆమె వేలికి ఉంగరం తొడిగింది ప్రముఖ నిర్మాత జాన్‌ పీటర్స్‌… ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరు ఇప్పటికీ ఒక్కటయ్యారు.. అలాగని అనుకున్న వారికి ఇప్పుడో షాక్‌ తగిలింది.. జనవరి 20న పెళ్లి చేసుకున్నారో లేదో అప్పుడే విడివిడిగా ఉండటం మొదలెట్టారు.. జాన్‌ పీటర్స్‌ […]

అయిదో మొగుడు-ఆరో భార్య.. ఆ పెళ్లి కూడా పెటాకులే !

బేవాచ్‌ సీరియల్‌లో అందాలను ఆరబోసి యూత్‌ను కిర్రెక్కించిన పమేలా ఆండర్సన్‌ మొన్నీమధ్యనే ఓ పెళ్లి చేసుకుంది.. ఇదివరకే నలుగురిని పెళ్లి చేసుకుని … వాళ్లను వదిలించుకున్న పమేలాకు ఇది అయిదో పెళ్లి… అయిదోసారి ఆమె వేలికి ఉంగరం తొడిగింది ప్రముఖ నిర్మాత జాన్‌ పీటర్స్‌… ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరు ఇప్పటికీ ఒక్కటయ్యారు.. అలాగని అనుకున్న వారికి ఇప్పుడో షాక్‌ తగిలింది.. జనవరి 20న పెళ్లి చేసుకున్నారో లేదో అప్పుడే విడివిడిగా ఉండటం మొదలెట్టారు.. జాన్‌ పీటర్స్‌ నుంచి తాను విడిగా ఉంటున్నట్టు పమేలానే ప్రకటించడంతో ఏమైందో అర్థం కాక తలబాదుకుంటున్నారు హాలీవుడ్‌ ఫాలోవర్స్‌… ‘జీవితంలో ఒకరి నుంచి ఒకరం ఏమి కోరుకుంటున్నామన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం.. ఈ విషయంలో స్పష్టత కోసం కొంత కాలం ఒకరికొకరు దూరంగా ఉండాలని అనుకున్నాం’ అంటూ ఓ బ్రహ్మండమైన కొటేషన్‌ ఇచ్చింది పమేలా… మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కోసం కొత్త దంపతులిద్దరూ అప్లయ్‌ చేసుకోకపోవడంతోనే అర్థమయ్యింది వారిద్దరూ అట్టే కాలం కలిసి ఉండరని… మూడు దశాబ్దాల కిందట జాన్‌ పీటర్స్‌.. పమేలా అండర్సన్‌లు తెగ ప్రేమించుకున్నారు.. ఇన్నాళ్లకు 74 ఏళ్ల పీటర్స్‌కు తన ప్రియురాలను పెళ్లి చేసుకునే అవకాశం కలిగింది. అన్నట్టు పీటర్స్‌కు ఇది ఆరపెళ్లి… హేమిటో… హాలీవుడ్‌ పెళ్లిళ్లు.. ఓ పట్టాన కుదురుకుని చావవు..! !

Published On - 5:19 pm, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu