AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. సౌతిండియాలోనే మొదటి హీరో..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతవరకు తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చిన బన్నీ ఇక్కడ పలు రికార్డులను

బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. సౌతిండియాలోనే మొదటి హీరో..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 06, 2020 | 4:44 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతవరకు తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చిన బన్నీ ఇక్కడ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు తన సినిమాల డబ్బింగ్ ద్వారా ఇటు మలయాళం, అటు హిందీలోనూ మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. సౌతిండియాలోని స్టార్ హీరోలెవరికి దక్కని ఘనత బన్నీకి దక్కింది. దీంతో ఆయన ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అసలు మ్యాటర్‌లోకి వెళ్తే.. అభిమానులకు మరింత దగ్గరగా ఉండేందుకు బన్నీ సోషల్ మీడియాల్లో అకౌంట్‌ను మెయిన్‌టెన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బన్నీ అధికారిక ఫేస్‌బుక్‌ అకౌంట్‌కి లైక్‌ల సంఖ్య 13 మిలియన్లకు చేరింది. దీంతో సౌతిండియాలోనే అధిక లైక్‌లు సాధించిన మొదటి హీరోగా రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్. ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్‌ ‘కింగ్ ఆఫ్‌ సోషల్ మీడియా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ మూవీతో మరో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న బన్నీ.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ఫలో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా పుష్ప విడుదల కాబోతోంది.

Read This Story Also: నా ట్రస్ట్‌లో పిల్లలందరూ కరోనాను జయించారు.. థ్యాంక్స్: లారెన్స్