Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 27,114 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో పంచాయతీ సెక్రెటరీ కళ్యాణ్.. ట్రైన్ కింద పడి ఆత్మహత్య. గత కొద్దిరోజుల క్రితం.. ఇతని కూతుర్ని.. ఘట్కేసర్ లో ఒకతను గొంతుకోసి చంపటం జరిగింది.
  • హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ నిర్వాకం. అధిక రెట్ ల తో సినిమా టికెట్ల విక్రయం. సినిమా టికెట్ ల పై 10 శాతం అధికంగా . జీ ఎస్టీ ఛార్జ్ వసూలు. 18 శాతం కు బదులు 28 శాతం టాక్స్ విధించి టికెట్ విక్రయం పై 30 లక్షలు ఆదాయం. జి ఎస్టీ అధికారులకు గతం లో పలు ఫిర్యాదులు.
  • సౌందర్యంతోపాటు సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి. పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై మరింతగా దృష్టిపెట్టాలి. భవిష్యత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలి. నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం (అర్కిటెక్చర్) కూడా ఒకటి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించాలి. ఐఐఏ జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • కోవిడ్-19పై ప్రధాని సమీక్షా సమావేశం. భేటీలో ఆరోగ్యశాఖ మంత్రితో పాటు హోంమంత్రి. కోవిడ్-19 తాజా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై చర్చ.
  • టీవీ9 మేయర్ బొంతు రామ్మోహన్: సచివాలయ కూల్చివేతలు సందర్భంగా పర్యావరణానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కూల్చివేత లకు జిహెచ్ఎంసి నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి. భారీ స్థాయిలో వచ్చే శిధిలాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియను మొదలుపెట్టపోతున్నాం... కొన్ని వందల లారీల్లో శిథిలాలను జీడిమెట్ల లోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కి తరలిస్తారు. రాత్రి సమయంలో మాత్రమే శిథిలాల తరలింపును చేపడతాం. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, రోడ్లు పాడవకుండా అన్ని జాగ్రత్తలు ఇలా తరలింపులో తీసుకుంటాం.. సచివాలయ శిథిలాల నుంచి కంకర, ఐరన్, డస్ట్ వేరుచేస్తారు.
  • నల్లకుం లోని పీహెచ్సీ సెంటర్, లాలాగూడ లోని రైల్వే హాస్పిటల్ కరోనా టెస్టింగ్ సెంటర్లను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కరోనా టెస్ట్ లు జరుగుతోన్న తీరు, వైద్య సిబ్బంది జాగ్రత్తలపై వివరాలను ఆరా తీసిన కేంద్రమంత్రి. కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.

నా ట్రస్ట్‌లో పిల్లలందరూ కరోనాను జయించారు.. థ్యాంక్స్: లారెన్స్

Raghava Lawrence trust children, నా ట్రస్ట్‌లో పిల్లలందరూ కరోనాను జయించారు.. థ్యాంక్స్: లారెన్స్

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ నిర్వహిస్తోన్న ట్రస్ట్‌లో 21 మంది కరోనా సోకిన విషయం తెలిసిందే. వారందరూ కరోనాను జయించారు. ఈ విషయాన్ని లారెన్స్ వెల్లడించారు. ట్రస్ట్‌లో 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కరోనా ఉన్నట్లు ఇటీవల వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు వారందరూ కోలుకోవడంతో లారెన్స్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ”నా అభిమానులు, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉంటున్న కొంతమంది చిన్నారులు ఇటీవల కరోనా వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. కరోనాను వాళ్లందరూ జయించారు, టెస్ట్‌ల్లో నెగిటివ్ రావడంతో వారిని తిరిగి ట్రస్ట్‌కి పంపారు. ఈ సందర్భంగా ఎంతో సేవ చేసిన ఎస్పీ వెలుమణి, మంత్రివర్యులు జి. ప్రకాశ్‌, అలాగే డాక్టర్స్, నర్సులు అందరికీ కృతజ్ఞతలు. నా సేవే నా పిల్లలని కాపాడిందని భావిస్తున్నాను. నా పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవే దైవం” అని లారెన్స్ పోస్ట్ చేశారు.

Read this Story Also: ఏపీ సచివాలయంలో పెరుగుతున్న కరోనా కేసులు.. మరో ఐదుగురికి పాజిటివ్.!

Hi friends and fans, I want to share a good news with you all. My trust kids who were taking treatment for Coronavirus…

Raghava Lawrence यांनी वर पोस्ट केले गुरुवार, ४ जून, २०२०

Related Tags