Akhanda Movie: అఖండ చిత్రానికి సీక్వెల్ రానుందా.. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చెప్పిన సమాధానం ఇదే..
Akhanda Movie: నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం 'అఖండ'. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం..
Akhanda Movie: నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిందీ సినిమా. కరోనాతో నష్టాల్లో ఉన్న థియేటర్లు, ప్రొడ్యూసర్లకు ఈ సినిమా ఒక్కసారిగా కొత్త ఊపు తెచ్చింది. అత్యధిక వసూళ్లతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ఉందని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మనసులో మాట బయటపెట్టారు. బుధవారం రవీందర్ రెడ్డి పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అఖండ సినిమాపై ముందు నుంచి నమ్మకంతో ఉన్నానని చెప్పిన రవీందర్.. బాలకృష్ణ కంటే, బోయపాటి కంటే తానే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడానని చెప్పుకొచ్చారు. అఖండ సినిమాపై ఉన్న నమ్మకమే తనను అలా మాట్లాడించిందని రవీందర్ తెలిపారు. ఇక అఖండ హిందీ రీమేక్‌పై స్పందించిన రవీందర్.. ‘ఈ సినిమా కథ ఏ భాషలో అయినా ఆడుతుంది. హిందీలో ఈ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉంది. అక్కడ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్‌లైతే సరిగ్గా సరిపోతార’ని చెప్పుకొచ్చారు. ఇక ‘అఖండ’కు సీక్వెల్ చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టిన నిర్మాత.. మంచి కథ కుదిరితే చేస్తానని చెప్పారు. ఇక 2022 మార్చిలో కొత్త సినిమాను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన రవీందర్ ఈసారి కొత్త హీరోని పరిచయం చేయనున్నట్లు తెలిపారు.
Also Read: Shyam Singha Roy : అమెరికాలోనూ అదరగొడుతున్న శ్యామ్ సింగ రాయ్.. ఇక పై మరిన్ని థియేటర్స్‌లో..