Dacoit Censor Review: అడివి శేష్ ‘డెకాయిట్’ ఎక్స్‌క్లూజివ్ సెన్సార్ రివ్యూ.. ఆ సీన్స్ మేజర్ హైలైట్..!
విభిన్న కంటెంట్ చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు అడివి శేష్. మేజర్, హిట్ 2 తర్వాత అతడు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ డెకాయిట్. ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అడివి శేష్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘డెకాయిట్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేయగా.. రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలుగా లాక్ చేశారు. ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా శేష్ సినిమా అంటే కచ్చితంగా కొత్తగా ఉంటుందనే నమ్మకం ఆడియన్స్‌లో ఉంది. దానికితోడు మూడేళ్ళ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా ఇది. అన్నింటికీ మించి స్క్రీన్ ప్లే విషయంలో అడివి శేష్ సినిమాలు ఎప్పుడూ రేసుగుర్రంలా పరిగెడుతుంటాయి. డెకాయిట్లోనూ ఇదే జరిగేలా కనిపిస్తుంది. మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ ఎమోషనల్ జర్నీతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్‌తో ఈ సినిమా ఉండబోతోందని సెన్సార్ టాక్ బలంగా వినిపిస్తోంది. నటీనటుల సహజమైన పెర్ఫార్మెన్స్, సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే గ్రిప్పింగ్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని తెలుస్తోంది.
నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి
ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. మోసాలు, కుట్రలతో నిండిన ఒక క్రూరమైన ప్రపంచంలో పుట్టిన స్వచ్ఛమైన ప్రేమకథగా దీన్ని చూపించబోతున్నారు. హీరో హీరోయిన్లు తప్పించుకునే సన్నివేశాలను రఫ్ లొకేషన్స్‌లో విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. స్టైలిష్ ఎడిటింగ్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. ఇక పవన్ సింగ్, జొనిత గాంధీ, భీమ్స్ గెస్ట్ అప్పీరెన్స్ థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. ముఖ్యంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ.. ప్రేమకు కొత్త అర్థం చెప్పే మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్, అలాగే స్వామి సర్ప్రైజ్ ఫస్ట్ హాఫ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయనే టాక్ వినిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఇంటర్నేషనల్ క్వాలిటీతో డిజైన్ చేసిన ఛేజింగ్ సీక్వెన్సెస్, యాక్షన్ స్టంట్లతో ఊపిరి బిగబట్టేలా ఉంటుందట. ఎవరూ ఊహించని ట్విస్టులు, దానికి తగ్గట్టుగా ప్రాణం పోసే బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని సెన్సార్ టాక్.
వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!
యాక్షన్‌తో పాటే కంటతడి పెట్టించే ఎమోషన్స్, దిమ్మతిరిగే రివిలేషన్స్ సెకండ్ హాఫ్‌లో మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఒక కమర్షియల్ మీటర్లో ఒక అద్భుతమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమకథను మేకర్స్ ఎంత వరల్డ్ క్లాస్ స్క్రీన్ ప్లేతో ప్రెజెంట్ చేశారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే ‘డెకాయిట్’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, బలమైన ఎమోషన్స్ ఉన్న ఒక ఎపిక్ లవ్ స్టోరీ అని సెన్సార్ రిపోర్ట్ నుంచి తెలుస్తున్న విషయం. వరల్డ్ క్లాస్ మేకింగ్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, లవ్ అండ్ ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా బ్లెండ్ అవ్వడంతో ఆడియన్స్‌కు ఇది పక్కా పైసా వసూల్ మూవీ కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అడివి శేష్ అకౌంట్లో డెకాయిట్ రూపంలో మరో ఇంటెన్స్ అండ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పడటం ఖాయమని ఈ రిపోర్ట్స్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. మరి చూడాలిక.. ఈ రిపోర్ట్ నిజమవుతుందో లేదో ఏప్రిల్ 10న తేలనుంది.
హీరో లేడు.. ఫైట్స్, స్పెషల్ సాంగ్స్ లేవు..! కట్ చేస్తే నాలుగేళ్లుగా ఓటీటీలో తిరుగులేని సినిమా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




