AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivathmika: వాటిని మర్చిపోవడమే మంచిది.. శివాత్మిక ఆసక్తికర వ్యాఖ్యలు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2023లో స్కై డైవింగ్ చేయాలనుకున్న తన డ్రీమ్‌ నెరవేరిందని చెప్పుకొచ్చింది. అది తన జీవితంలోనే మరచిపోలేని జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటానంది. ఇక 2023లో తనకు గొప్పగా గడించిందన్న చిన్నది, గతేడాది అన్ని విధాలుగా కలిసొచ్చిందని చెప్పుకొచ్చింది. తాను ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్న పనులు ఈ ఏడాది జరిగాయని,కుటుంబం పరంగా కూడా బాగా గడిచిందని...

Shivathmika: వాటిని మర్చిపోవడమే మంచిది.. శివాత్మిక ఆసక్తికర వ్యాఖ్యలు.
Shivathmika
Narender Vaitla
|

Updated on: Jan 01, 2024 | 10:09 AM

Share

ప్రతీ ఒక్కరూ జీవితంలో మంచి, చెడు రెండు రకాల ఘటనలు ఎదుర్కొంటారు. అయితే చెడును మర్చిపోతూ, మంచి వాటినే మాత్రమే గుర్తంచుకొని ముందుకు వెళ్లడమే జీవితమని చెబుతుంటారు. అచ్చంగా ఇవే మాటలు చెబుతోంది అందాల తార శివాత్మిక. కొత్తేడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో గతేడాది జరిగిన చెడు సంఘటనలను గుర్తు తెచ్చుకోవాలనుకోవడం లేదంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ చిన్నది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2023లో స్కై డైవింగ్ చేయాలనుకున్న తన డ్రీమ్‌ నెరవేరిందని చెప్పుకొచ్చింది. అది తన జీవితంలోనే మరచిపోలేని జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటానంది. ఇక 2023లో తనకు గొప్పగా గడించిందన్న చిన్నది, గతేడాది అన్ని విధాలుగా కలిసొచ్చిందని చెప్పుకొచ్చింది. తాను ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్న పనులు ఈ ఏడాది జరిగాయని,కుటుంబం పరంగా కూడా బాగా గడిచిందని, మొత్తం మీద దేవుడి దయవల్ల, 2023 తన జీవితంలో సంతోషంగా ముగిసిందని తెలిపింది.

శివాత్మిక ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌..

ఇక కొత్తేడాది ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. మనసును ఎక్కువగా ఫాలో అవుతూ పనిచేస్తాన్న శివాత్మిక ప్రతి అంశం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించేలా జీవిస్తానని తెలిపింది. గతేడాది ఇలా ప్రయత్నించి సంతోషంగా ఉన్నానని, ఈ ఏడాది కూడా ఇదే ఫాలో అవ్వాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. 2024పై పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదని, ఫ్లోను బట్టి ముందుకెళ్తానని తెలిపింది. అయితే అన్నీ మంచి, గొప్ప అంశాలే జరగాలని కోరుకుంటున్నానని, సంతోషంగా, హాయిగా, ఆరోగ్యకరంగా గడవాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

శివాత్మిక లేటెస్ట్‌ ఇన్‌స్టా పోస్ట్‌..

ఇక శివాత్మిక కెరీర్‌ విషయానికొస్తే.. 2020లో దొరసాని అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. పేరుకు నట వారసత్వం ఉన్నా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తనదైన అందం నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి శివాత్మికకు సైమా 2019 బెస్ట్‌ డెబ్యూ హీరోయిన్‌ అవార్డు సైతం వచ్చింది. ఇక అనంతరం పంచతంత్రం మూవీలో నటించిన ఈ చిన్నది తర్వాత ఓ తమిళ సినిమాలో నటించింది. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తండలో తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా, తమిళంలో ఒక సినిమాలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..