Bhumika Chawla: కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సీనియర్ హీరోయిన్ భూమిక.. ఏకంగా గోవాలోనే..
సినిమా ఇండస్ట్రీలోని తారలందరూ వ్యాపార రంగంలోకి దిగుతున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రకరకాల బిజినెస్‌ల్లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల ఈ ట్రెండ్ మరింత ఎక్కువైంది. తాజాగా సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా నయా బిజినెస్ స్టార్ట్ చేసింది.
Updated on: Dec 31, 2023 | 9:47 PM

సినిమా ఇండస్ట్రీలోని తారలందరూ వ్యాపార రంగంలోకి దిగుతున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రకరకాల బిజినెస్‌ల్లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల ఈ ట్రెండ్ మరింత ఎక్కువైంది. తాజాగా సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా నయా బిజినెస్ స్టార్ట్ చేసింది.

ఇండియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్‌గా పేరున్న గోవాలో కొత్త హోటల్‌ను ప్రారంభించింది భూమిక. అనంతరం ఈ వార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.

'గోవాలో మా కొత్త వెంచర్ సమర వెల్నెస్ హోటల్' అంటూ భూమిక ఇన్‌స్టాలో రాసుకోచ్చింది. ఇక ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ భూమికకు అభినందనలు తెలుపుతున్నారు.

యువకుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది భూమిక. పవన్ కల్యాణ్ ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఒక్కడు, సింహాద్రి, మిస్సమ్మ, వాసు తదితర సినిమాలతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ స్పెషల్ రోల్స్‌తో సందడి చేస్తోందీ అందాల తార. నాని ఎంసీఏలో మెరిసిన ఈ సీనియర్ భామ ఇటీవల ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తోంది.