Samantha: నయనతారను రీప్లేస్ చేస్తోన్న సమంత.. బాద్షాషాతో నటించే లక్కీ ఛాన్స్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Samantha: గత కొన్ని రోజులుగా నటి సమంత టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది. మొదట్లో ట్రోలింగ్ కారణంగా సోషల్ మీడియాలో..
Samantha: గత కొన్ని రోజులుగా నటి సమంత టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది. మొదట్లో ట్రోలింగ్ కారణంగా సోషల్ మీడియాలో నిలిచిన సమంత ఇప్పుడు తన కెరీర్ పరంగా మరోసారి వార్తల్లోకెక్కారు. వివాహం తర్వాత ఆచితూచి సినిమా కథలు ఎన్నుకున్న సమంత.. సినిమాల సంఖ్యను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే విడాకుల తర్వాత ఒక్కసారిగా సినిమాల వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతంల మూవీని కంప్లిట్ చేసిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు ఓకే చెబుతోంది.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల నటి ఇప్పుడు తన గురిని మొత్తం హిందీ చిత్రసీమవైపే ఎక్కుపెట్టినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా.. మరో క్రేజ్ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో షారుఖ్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నయనతార ప్లేస్‌ను సమంత రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఓకే చేశారని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. అంతేకాకుండా ఈ సినిమా కోసం సమంతకు అదిరిపోయే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. నిర్మాతలు ఏకంగా రూ. 7 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.