Manchu Vishnu: అలయ్ బలయ్‌లో విష్ణు, పవన్ కళ్యాణ్‌ల మధ్య అసలేం జరిగింది.. వీడియోతో క్లారిటీ వచ్చేసింది..
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి, ఫలితాలు వచ్చాయి, ప్రెసిడెంట్‌గా విష్ణు ప్రమాణ స్వీకరం కూడా చేశారు. అయితే.. ఈ ఎన్నికల చుట్టూనెలకొన్న వివాదాలు మాత్రం..
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి, ఫలితాలు వచ్చాయి, ప్రెసిడెంట్‌గా విష్ణు ప్రమాణ స్వీకరం కూడా చేశారు. అయితే.. ఈ ఎన్నికల చుట్టూనెలకొన్న వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకో వివాదం, గంటకో చర్చ అన్నట్లు సాగుతోంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన సభ్యుల రాజీనామాతో ఒక్కసారిగా మా వివాదం తారా స్థాయికి చేరుకుంది. అంతేకాకుండా మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రకాశ్ రాజ్ ఆరోపిండంతో సీసీ కెమెరాల పరిశీలన అంశం కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే మా ఎన్నికలు మెగా ఫ్యామిలీ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్లు మారిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా వీరిద్దరు ఎడ మొహం పెడ మొహం పెట్టుకున్నారని. ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదని, దీంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతోందని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఈ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మంచు విష్ణు.
What really went down ?. https://t.co/6uHvs1He2S
— Vishnu Manchu (@iVishnuManchu) October 19, 2021
‘అసలు జరిగిన విషయం ఇదే’నంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో.. స్టేజ్ ఎక్కేముందు విష్ణు, పవన్‌లు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటున్న సన్నివేశాలు ఉన్నాయి. విష్ణు కనిపించిన వెంటనే పవన్ ఆత్మీయంగా హగ్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య చాలా సేపు సంభాషణ జరిగింది. దీంతో.. పవన్, విష్ణుల మధ్య మాటలు లేవు అని జరుగుతోన్న ప్రచారానికి ఈ వీడియోతో చెక్ పడినట్లు అయ్యింది.