AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: ‘నేను పొట్టి దుస్తులు వేసుకోకపోవడానికి ఈ వీడియోనే కారణం’.. ‘హైబ్రిడ్‌ పిల్ల’ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Sai Pallavi: అందం అభినయం కలగలిపిన నటీమణుల్లో నటి సాయి పల్లవి మొదటి వరుసలో ఉంటారు. అందరూ డాక్టర్‌ కావాలనుకొని యాక్టర్‌ అయ్యాను అని చెబుతుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం డాక్టర్‌ అయిన తర్వాత...

Sai Pallavi: 'నేను పొట్టి దుస్తులు వేసుకోకపోవడానికి ఈ వీడియోనే కారణం'.. 'హైబ్రిడ్‌ పిల్ల' ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Narender Vaitla
| Edited By: |

Updated on: Jun 13, 2022 | 8:29 PM

Share

Sai Pallavi: అందం అభినయం కలగలిపిన నటీమణుల్లో నటి సాయి పల్లవి మొదటి వరుసలో ఉంటారు. అందరూ డాక్టర్‌ కావాలనుకొని యాక్టర్‌ అయ్యాను అని చెబుతుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం డాక్టర్‌ అయిన తర్వాత యాక్టర్‌ అయ్యింది. ప్రేమమ్‌ (Premam) సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. ఇక ఫిదా (Fida) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించి తెలుగమ్మాయిలా మారిపోయింది. ఇక కెరీర్‌ తొలి నాళ్ల నుంచి గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది సాయి పల్లవి. వస్త్రాధారణ విషయంలోనూ ఈ అందాల భామ ఏనాడు హద్దు మీరలేదు. అయితే తనకు పొట్టి దుస్తులు ధరించడంపై ఎలాంటి అభ్యంతరం లేదని తాను ఆ అవుట్‌ ఫిట్స్‌లో కంఫర్ట్‌ ఉండనని సమాధానం చెబుతూ వచ్చే సాయి పల్లవి తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాను పొట్టి దుస్తులు ధరించకపోవడానికి ఒక వీడియోనే కారణమని ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి తన జీవితంలో ఎదురైన ఓ విషయాన్ని పంచుకుంది. ఈ విషయమై సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘డాక్టర్‌ కోర్స్‌లో భాగంగా జార్జియా వెళ్లిన సమయంలో టాంగో డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ఈ డ్యాన్స్‌ నేర్చుకోవాలంటే అందుకు అనుకూలంగా ఉండే కాస్ట్యూమ్స్‌ మాత్రమే ధరించాలి. నిజానికి మా పేరెంట్స్‌కు ఇలాంటివి నచ్చకపోయినప్పటికీ వారిని ఒప్పించి డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ఇదే సమయంలో ‘ప్రేమమ్‌’లో నటించిన తర్వాత జార్జియాలో టాంగ్‌ డ్యాన్స్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. ప్రేమమ్‌లో నా నటనకు ప్రశంసలు దక్కాయి, అదే సమయంలో వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు చేసిన కామెంట్స్‌ ఇబ్బందిగా అనిపించాయి. ఆ క్షణం నుంచి పొట్టి దుస్తులకు నో చెప్పడం మొదలు పెట్టాను’ అని అసలు విషయాన్ని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

సాయి పల్లవి చెప్పిన ఆ వీడియో ఇదే..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే సాయిపల్లవి నటించిన తాజాగా చిత్రం ‘విరాట పర్వం’ జూన్ 17న ప్రేక్షకులకు ముందుకు రానున్న విషయం తెలిసిందే. 1990లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రానా హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. రానా రవన్న అనే విప్లవ నాయకుడిగా కనిపించిగా, అతన్ని ప్రేమించే యువతి పాత్రలో సాయిపల్లవి నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..