AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara House: అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఇల్లు కొనుగోలు చేసిన నయన్‌.. విఘ్నేష్‌ కోసమేనా.?

Nayanthara House: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్‌తో దూసుకుపోతోంది అందాల తార నయనతార. సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌గా చోటు...

Nayanthara House: అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఇల్లు కొనుగోలు చేసిన నయన్‌.. విఘ్నేష్‌ కోసమేనా.?
Nayanathara New House
Narender Vaitla
|

Updated on: Nov 27, 2021 | 5:54 PM

Share

Nayanthara House: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్‌తో దూసుకుపోతోంది అందాల తార నయనతార. సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌గా చోటు దక్కించుకుందీ బ్యూటీ. ఇక సౌతిండియాకు చెందిన నటీమణుల్లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న నటీమణిగా కూడా నయనతార ఓ అరుదైన గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రం కోసం నయనతార ఏకంగా రూ. 4 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమాయణంలో ఉన్న ఈ చిన్నది నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటి వరకు పెళ్లి విషయమై వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ తాజాగా కొత్తింటి కొనుగోలు విషయంలోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. నయనతార తాజాగా చెన్నైలోని పొయెస్‌ గార్డెన్‌లో ఫోర్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్‌ విలువ రూ. కోట్లలో ఉంటుందని అంచనా. ఇక నయన తార ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఈ ఇంటిలోకి విఘ్నేష్‌తో కలిసి జీవించనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి నయనతార పెళ్లి వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఇటీవల నయనతార, విఘ్నేశ్‌లు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఇదిలా ఉంటే నయనతార ఫ్లాట్‌ కొనుగోలు చేసిన ఈ పొయెస్‌ గార్డెన్‌ అత్యంత ఖరీదైన ప్రాంతంగా తెలుస్తోంది. ఇక్కడే దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్‌లు కూడా నివాసాలు ఉన్నారు. ఇక తాజాగా ధనుష్‌ కూడా ఇక్కడే తన ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Also Read: Andhra Pradesh: రోడ్డుపై చలికి వణికిపోతున్న మహిళ..ఖాకీ ఔదార్యం!

Dare to Dream 2021: టీవీ9 భారత్‌వర్ష డేర్ టు డ్రీం అవార్డుల మూడో సీజన్.. ప్రారంభ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేయనున్న ఎంఎస్ఎంఈ కార్యదర్శి బీబీ స్వైన్

Viral Video: అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టిన ఎలుగుబంటి.. ‘రేపు రా’ అని చెప్పగానే వెళ్లిపోయింది