Khushbu Sundar: అందుకే ఆ హీరోతో సినిమా చేయలేదు.. ఇన్నాళ్టికి అసలు విషయం చెప్పిన ఖుష్బూ
80, 90లలో దక్షిణాది సినిమా ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఖుష్బూ. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి అలరించింది. అప్పట్లో ఆమె అందానికి యూత్ ఏకంగా గుడి కట్టారు. కొన్నాళ్లపాటు సినిమా ప్రపంచాన్ని ఏలిన ఖుష్భూ ఇప్పుడు మాత్రం సహాయ నటిగా రాణిస్తుంది. యంగ్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది.

అందాల తార ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె అందానికి, నటనకు యూత్ ఫిదా అయ్యారు. ఏకంగా ఆమెకు గుడి కట్టారు. అప్పట్లో హీరోయిన్ గా అలరించిన ఖుష్బూ.. ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తున్నారు ఖుష్బూ. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా ఖుష్బూ సందడి చేస్తున్నారు. పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 1980ల నాటి తరం నటీనటుల రీయూనియన్ గురించి పంచుకున్నారు. స్టార్ల వ్యక్తిగత జీవితాలను ప్రజలు ఒక మాగ్నిఫైయింగ్ గ్లాస్‌తో చూస్తారని, అయితే వారు కూడా సాధారణ మనుషులేనని ఆమె అన్నారు. సెలబ్రిటీల గురించి వచ్చే వార్తలను ప్రజలు నిజమని నమ్మడానికి ముందు చాలాసార్లు పరిశీలిస్తారని ఖుష్బూ చెప్పుకొచ్చారు.
ఖుష్బూ తన సినీ ప్రస్థానాన్ని 1986లో తెలుగు చిత్రంతో ప్రారంభించారు. వెంకటేష్ హీరోగా నటించిన చిత్రంలో ఆమె మొదటిసారి హీరోయిన్గా నటించారు. తన కెరీర్లో వెంకటేష్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ వంటి పలువురు తెలుగు స్టార్లతో కలిసి పనిచేశారు. అయితే, బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్ర తారలతో హీరోయిన్ గా నటించే అవకాశం రాలేదని తెలిపారు. తెలుగులో సినిమాలు చేస్తున్న సమయంలోనే తమిళ్, కన్నడ సినిమాల్లోనూ ఆఫర్స్ రావడంతో అక్కడే సెటిల్ అయ్యాయని.. అందుకే ఎక్కువ తెలుగు సినిమాలు చేయదని తెలిపారు ఖుష్బూ. అంతేకాకుండా, ఆ సమయంలో తెలుగు సినీ పరిశ్రమ కేంద్రం చెన్నై నుంచి హైదరాబాద్‌కు మారడం కూడా ఒక కారణమని ఖుష్బూ అన్నారు. తాను చెన్నైలో ఉండిపోవడంతో, ఇక్కడ ఆఫర్లు వచ్చినప్పుడు తమిళ చిత్రాల డేట్లతో క్లాష్ అయ్యాయని అన్నారు. ఉదాహరణకు, చంటి సినిమాలో నటించే అవకాశం వచ్చినా, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్లతో చేస్తున్న రెండు తమిళ చిత్రాలను వదులుకోవాల్సి వస్తుందని ఆ అవకాశాన్ని వదులుకున్నానని అన్నారు. అలాగే బాలకృష్ణ సినిమాతో సినిన్మ చేయలేకపోయా అని అన్నారు ఖుష్బూ. ఇక చాలా కాలం తర్వాత చిరంజీవి స్టాలిన్ సినిమాలో అక్కగా నటించారు ఖుష్బూ.
ఖుష్బూ జీవితంలో 1980ల నాటి నటీనటుల రీయూనియన్ అనేది ఒక ముఖ్యమైన భాగం. ఈ రీయూనియన్ ఎప్పుడు జరుగుతుందా అని కోట్ల మంది ఎదురు చూస్తుంటారని, తాము ఎంతగా ఎదురు చూస్తామో తెలియదని ఆమె అన్నారు. ఈ మీటింగ్ లో అందరూ స్టార్లను కాదని, చిన్నపిల్లల్లా సరదాగా గడుపుతారని ఆమె అన్నారు. ఎలాంటి అల్లర్లు చేస్తారో, ఏ రంగు దుస్తులు ధరిస్తారో, ఎలాంటి నృత్యాలు చేస్తారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని ఖుష్బూ తెలిపారు.. “క్లాస్ ఆఫ్ 80స్” పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని, అందులో 36 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈ గ్రూప్‌లో రోజూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారని, చిన్న విషయాల నుండి సమస్యల వరకు అన్నీ పంచుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
