AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: నా జీవిత లక్ష్యం అదే, త్వరలోనే మొదలుపెడతా.. ఇంతకీ కృతిశెట్టి లక్ష్యం ఏంటంటే..

Krithi Shetty: ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది అందాల తార కృతిశెట్టి. తొలి చిత్రంతోనే తనదైన నటన, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో...

Krithi Shetty: నా జీవిత లక్ష్యం అదే, త్వరలోనే మొదలుపెడతా.. ఇంతకీ కృతిశెట్టి లక్ష్యం ఏంటంటే..
Narender Vaitla
|

Updated on: Aug 06, 2022 | 6:20 PM

Share

Krithi Shetty: ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది అందాల తార కృతిశెట్టి. తొలి చిత్రంతోనే తనదైన నటన, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. ఇక కృతిశెట్టి తాజాగా నటిస్తోన్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. నితిన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎమ్‌.ఎస్‌ రాజ శేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కృతిశెట్టి, కేథరిన్‌ థ్రెసా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అంజలి స్పెషల్‌ సాంగ్‌తో ఆకట్టుకుంది. ఆగస్టు 12 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలోనే కృతిశెట్టి శనివారం విలేఖరలు సమావేశంలో మాట్లాడింది. ఈ సందర్భంగా కృతి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘మాచర్ల నియోజకవర్గం’లో తన పాత్ర సింపుల్ అండ్ ఇన్నోసెంట్ అన్న కృతి.. తన పాత్రలో చాలా షేడ్స్ వుంటాయని తెలిపింది. సీన్ ని బట్టి ఒక్కో షేడ్ బయటికి వస్తుందని పాత్ర సీక్రెట్‌ చెప్పేసింది. ఇక ఈ సినిమాతో నితిన్‌ తనకు మంచి స్నేహితుడయ్యాడని, ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి అని చెప్పుకొచ్చింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కృతి.. ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని చెప్పింది. దర్శక నిర్మాతలు బలమైన నమ్మకం కలిగించినపుడు దాని గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చేసింది.

సినిమాలు కాకుండా వేరే లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా.? అన్న ప్రశ్నకు బదులిచ్చిన కృతిశెట్టి.. తనకు చిన్నప్పటి నుంచి ఎన్జీవో స్టార్ట్ చేయాలనీ వుండేదని, త్వరలోనే మొదలుపెడతానని అనుకుంటున్నానని తెలిపిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే కృతి శెట్టి ప్రస్తుతం సూర్యతో ఒక సినిమా, నాగచైతన్యతో సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు ఇంద్రగంటి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తోన్న ఈ బ్యూటీ మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు