Karthikeya 2: మూవీ లవర్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. కార్తికేయ 2 ట్రైలర్‌ రిలీజ్‌.. మాములుగా లేదుగా..

Karthikey 2: ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీస్‌లో కార్తికేయ 2 ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కార్తికేయ మొదటి భాగం అనూహ్య విజయాన్ని...

Karthikeya 2: మూవీ లవర్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. కార్తికేయ 2 ట్రైలర్‌ రిలీజ్‌.. మాములుగా లేదుగా..
Follow us

|

Updated on: Aug 06, 2022 | 6:26 PM

Karthikeya 2: ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీస్‌లో కార్తికేయ 2 ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కార్తికేయ మొదటి భాగం అనూహ్య విజయాన్ని అందుకోవడంతో సెకండ్‌ పార్ట్‌పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. పెరిగిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సీక్వెల్‌ను దర్శకుడు చందు మొండేటీ పకడ్బంధీగా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ సినిమాపై మంచి బజ్‌ను తెచ్చాయి.

ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా కార్తికేయ2 ట్రైలర్‌ను విడుదల చేసింది. శ్రీకృషుడి సమయంలో సముద్ర గర్భంలో మునిగిపోయినా ద్వారకా నగర నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌ను ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిఖిల్‌ నటన, కాలభైరవ్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచాయి. తొలి పార్ట్‌లోలాగే ఇందులో కూడా డైలాగ్‌లు అద్భుతంగా ఉండనున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

కార్తికేయ 2 ట్రైలర్..