AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. నా 9 ఏళ్ల కష్టం ఆయన వల్లే సాధ్యమైంది.. హీరోయిన్ ఎమోషనల్..

డాక్టర్ చదివి నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలో వరుస అవకాశాలు అందుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. కామాక్షి భాస్కర్ల ఇప్పుడు నటిస్తున్న సినిమా అగధ. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా కామాక్షి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Tollywood : తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. నా 9 ఏళ్ల కష్టం ఆయన వల్లే సాధ్యమైంది.. హీరోయిన్ ఎమోషనల్..
Toxic Movie
Rajitha Chanti
|

Updated on: Aug 11, 2026 | 9:46 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం అగద చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఎమ్మె్స్ రాజు దర్శకత్వం వహించగా.. శ్రవణ్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. అయితే ఇటీవల జరిగిన అగధ ప్రీ-రిలీజ్ వేడుకలో నటి కామక్షి భాస్కర్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైనదని మూడు ప్రధాన కారణాలను వెల్లడించారు. మొదటిది, ఎం.ఎస్. రాజుగారు రూపొందించిన అగధ ప్రపంచంలో భాగమై, సహనటులతో కలిసి పనిచేసి, సాంకేతిక నిపుణుల నుండి నేర్చుకుంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమా విడుదలకు అతి చేరువ కావడమని తెలిపారు. కేవలం నాలుగు రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇన్ని రోజులు పడిన శ్రమకు ప్రతిఫలం దక్కనుందని భావిస్తూ, ఆ ఆనందం తనను ఎంతగానో ఉద్వేగానికి గురిచేస్తోందని తెలిపారు.

రెండో కారణం, 2017 ఆగస్టులో భారతదేశానికి వచ్చిన తాను, 2026 ఆగస్టు నాటికి తొమ్మిదేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక సినిమాకు ముఖ్య పాత్రను పోషించగలగడమన అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా కష్టమని, అలాంటిది ఎం.ఎస్. రాజుగారు తనను నమ్మి ఒక బలమైన పాత్రను అప్పగించినందుకు జీవితాంతం కృతజ్ఞురాలిగా ఉంటానని కామక్షి పేర్కొన్నారు. ఇది కేవలం ఆయన వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఇక మూడో కారణం, తన కుటుంబ సభ్యులు తన పక్కన ఉండటమని తెలిపారు. తన అన్నయ్య, తల్లి, పిన్ని వేదికపై ఉన్నందుకు కామక్షి ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ వృత్తిని వదిలి నటనలోకి వచ్చినప్పుడు ఎదురైన ప్రశ్నలను, కుటుంబంపై పడిన ఒత్తిడిని గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులు తనకు మద్దతుగా నిలిచి, తన కలను నెరవేర్చుకోవడానికి చేసిన త్యాగాలను ఆమె కొనియాడారు. వారి మద్దతు లేకుంటే తాను ఈ స్థాయికి చేరుకోలేకపోయేవారినని, ఈ చిత్రం తన కెరీర్‌కు పునాది రాయి అని నొక్కి చెప్పారు. విజయం అంటే స్టార్‌డమ్ మాత్రమే కాదని, ఏమీ లేని చోట బేస్ క్రియేట్ చేసుకొని నిలబడటమే నిజమైన విజయమని తెలిపారు. ఎం.ఎస్. రాజుగారికి, తన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, పదేళ్ల తర్వాత కూడా స్టేజ్‌పై నిలబడి తన కెరీర్‌కు పునాది వేసింది రాజుగారే అని చెబుతానని కామక్షి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అగధ 2 కూడా తనతోనే ఉంటుందని ఎం.ఎస్. రాజుగారు ప్రకటించడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

డాక్టర్ చదివి నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలో వరుస అవకాశాలు అందుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. కామాక్షి భాస్కర్ల ఇప్పుడు నటిస్తున్న సినిమా అగధ. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా కామాక్షి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్