AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: ఎన్టీఆర్‌కు జోడిగా నటించడంపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్.. ఏమన్నారంటే..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌.. సగటు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అలనాటి అందాల తార శ్రీదేవీ కూతురిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును...

Janhvi Kapoor: ఎన్టీఆర్‌కు జోడిగా నటించడంపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్.. ఏమన్నారంటే..
Narender Vaitla
|

Updated on: Aug 04, 2022 | 7:57 PM

Share

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌.. సగటు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అలనాటి అందాల తార శ్రీదేవీ కూతురిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ. సినిమా బ్యాగ్రౌండ్‌ ఉన్నా ఫస్ట్‌ మూవీ ‘ధడక్‌’తో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత కూడా ఆచితూచి పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఇక కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌తో నటించనున్నట్లు అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని తేలిపోయింది. ఇక అనంతరం ఎన్టీఆర్‌తో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో జాన్వీని హీరోయిన్‌గా తీసుకోనున్నారని వార్తలు తెగ హంగామా చేశాయి. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

తాజాగా ఈ వార్తలపై జాన్వీ తొలిసారి అధికారికంగా స్పందించింది. ఇటీవల ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. జాన్వీ మాట్లాడుతూ..’తెలుగు సినిమా లేదా ఏదైనా సౌత్‌ సినిమాలో నటించాలని నాకు చాలా ఆసక్తి ఉంది. అందులోనూ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. ఆయనొక లెజెండ్‌.. అయితే మీరనుకుంటున్నట్లుగా ఎన్టీఆర్‌తో నటించే అవకాశం నాకు రాలేదు. కానీ ఆయనతో కలిసి పని చేయడానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఇన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి చెక్‌ పడినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై