AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani : ప్రొడ్యూసర్ గిల్డ్ షాక్ ఇచ్చిన నేచురల్ స్టార్.. షూటింగ్ ఆపేదే లేదంటున్న నాని..

ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్ లను బంద్ చేయాలని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా సినిమాలు ఆగిపోయాయి. అయితే కొన్ని మాత్రం షూటింగ్ లను ఆపకుండా జరుపుతూనే ఉన్నాయి.

Nani : ప్రొడ్యూసర్ గిల్డ్ షాక్ ఇచ్చిన నేచురల్ స్టార్..  షూటింగ్ ఆపేదే లేదంటున్న నాని..
Nani
Rajeev Rayala
|

Updated on: Aug 04, 2022 | 4:28 PM

Share

ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్ లను బంద్ చేయాలని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా సినిమాలు ఆగిపోయాయి. అయితే కొన్ని మాత్రం షూటింగ్ లను ఆపకుండా జరుపుతూనే ఉన్నాయి. సినిమా నిర్మాణ వ్యయం ఎక్కువైపోవడంతో ప్రొడ్యూసర్లకు నష్టం కలుగుతుందని పలువురు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయాన్ని నేచురల్ స్టార్ నాని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. త్వరలోనే నాని(Nani)తన కొత్త సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నాడట. ఈ మేరకు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే సోమవారం నుంచి కొంతమంది నిర్మాతలు తమ సినిమాల షూటింగ్స్ ను యధావిధిగా జరపాలని నిర్ణయించుకున్నారట.. దీనికి కారణం కూడా లేకపోలేదు. సినిమా షూటింగ్స్ బంద్ చేయాలన్న దిల్ రాజు మాత్రం ఆయన సినిమాను ఆపకుండా షూటింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. దిల్ రాజు ప్రస్తుతం తమిళ్ హీరో దళపతి విజయ్ తో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అదేంటి అని ప్రశ్నిస్తే ఈ సినిమా తమిళ్ మూవీ అని చెపుతున్నారట. దాంతో కొంతమంది నిర్మాతలు మా సినిమాలను ఎందుకు ఆపాలని సోమవారం నుంచి షూటింగ్స్ షురూ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే నాని నటిస్తున్న దసరా సినిమా షూటింగ్ ను కూడా మొదలపెట్టనున్నాడట. ఇటీవలే ఈ యంగ్ హీరో అంటే సుందరానికి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బకాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇక ఇప్పుడు దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ ని సోమవారం నుంచి ప్రారంభించబోతున్నారట. ఇటీవలే నాని కలిసి షూటింగ్ ని నిలిపివేయాలని గిల్డ్ సభ్యులు కోరారట. తన నిర్మాతకు ఇబ్బందులు కలిగించడం తనకు ఇష్టం లేదని నాని చెప్పారట. దాంతో ఈ సినిమా షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే