Ileana: చేతికి సెలైన్‌తో ఆసుపత్రి బెడ్‌పై.. అసలు ఇలియానాకు ఏమైంది.?

ఇలియానా.. ఇప్పుడీ పేరు పెద్దగా ట్రెండింగ్‌లో లేదు కానీ. ఒకప్పుడు మాత్రం టాలీవుడ్‌లో ఈ పేరు ఓ సెన్సేషన్‌. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిందీ బ్యూటీ. దేవదాస్‌ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది ఎన్నో బ్లాక్‌ బ్లస్టర్స్‌ మూవీస్‌లో నటించి అగ్ర కథనాయికగా పేరు....

Ileana: చేతికి సెలైన్‌తో ఆసుపత్రి బెడ్‌పై.. అసలు ఇలియానాకు ఏమైంది.?
Ileana
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 30, 2023 | 6:56 PM

ఇలియానా.. ఇప్పుడీ పేరు పెద్దగా ట్రెండింగ్‌లో లేదు కానీ. ఒకప్పుడు మాత్రం టాలీవుడ్‌లో ఈ పేరు ఓ సెన్సేషన్‌. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిందీ బ్యూటీ. దేవదాస్‌ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది ఎన్నో బ్లాక్‌ బ్లస్టర్స్‌ మూవీస్‌లో నటించి అగ్ర కథనాయికగా పేరు సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఇండస్ట్రీకి ఒక్కసారిగా దూరమైందీ గోవా బ్యూటీ. ప్రస్తుతం చేతిలో ఎలాంటి సినిమాలు లేని ఈ చిన్నది అడపా దడపా సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను షేర్‌ చేసుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు ఆమె ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా షాక్‌కి గురి చేశాయి. చేతికి సెలైన్‌తో ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ఇలియానా ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలతో పాటు.. తాను ఆహారం తీసుకోలేని స్థితి ఉండగా వైద్యులు మూడు బాటిళ్ల సలైన్స్‌ ఎక్కించినట్లు రాసుకొచ్చింది. ఇక మరో ఫొటోతో పాటు.. ఒక్క రోజులో ఎంత మార్పు అంటూ చేతికి సలైన్‌ ఎక్కిస్తున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.

Ileana Health

ఇవి కూడా చదవండి

దీంతో అభిమానులు కంగారు పడ్డారు. అయితే తర్వాత తన కోసం ఆందోళన చెందుతోన్న వారిని ఉద్దేశిస్తూ మరో పోస్ట్‌ చేసింది. ఇందులో.. ‘డాక్టర్లు బాగా చికిత్స అందిస్తున్నారు. 3 బ్యాగ్స్‌ ఐవీ లిక్విడ్స్‌ ఇచ్చారు. అందరూ నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఇంతగా నాపై ప్రేమ, అప్యాయత చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞుతురాలిని. ఇప్పుడ నేను బాగానే ఉన్నాను. నాకు మంచి వైద్యం అందుతోంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఆమె ఫ్రెండ్స్‌, ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..