AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇద్దరు ఏపీ ఎమ్మెల్యేల సోదరులు.. టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్లు.. వారెవరో మీకు తెల్సా..?

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి చెందినవారే. వారి సోదరులు టాలీవుడ్‌లో టాప్ హీరోలతో సినిమాలు చేశారు.. చేస్తున్నారు.

Tollywood: ఇద్దరు ఏపీ ఎమ్మెల్యేల సోదరులు.. టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్లు.. వారెవరో మీకు తెల్సా..?
Andhra Pradesh Assembly
Ram Naramaneni
|

Updated on: Jan 30, 2023 | 7:25 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో సినిమాలను, రాజకీయాలను వేరు చేయలేం. అన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ నుంచి ఈ కల్చర్ అలా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు చాలామంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక పార్టీకి మద్దతు తెలుపుతున్నవారే. అలానే వివిధ క్రాప్టులకు చెందిన ప్రముఖులు సైతం ఇలా పార్టీలకు తమ సపోర్ట్ తెలుపుతూనే వస్తున్నారు. ఇక ఎలక్షన్స్ వస్తే.. చిన్నా చితక ఆర్టిస్టులు సైతం ప్రచారానికి వస్తారు. ఇది అంతా రెగ్యూలర్‌గా జరిగే తంతే.

అయితే ఏపీలోని ఇద్దరు ఎమ్మెల్యేల సోదరులు టాలీవుడ్‌లో దర్శకులుగా దుమ్మురేపుతున్నారు. అది కూడా ఏదో దూరపు రిలేషన్ కాదండోయ్. వారి రక్తం పంచుకుని పుట్టిన సోదరులు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి చెందినవారే. వారు ఎవరో మీరు గెస్ చేయలగారా..? ఆలోచిస్తే వారిలో ఒక డైరెక్టర్‌ను పట్టుకోవచ్చు. కానీ రెండో వ్యక్తో ఎవరో కనిపెట్టడం మాత్రం చాలా కష్టం. ఇంకెందుకు ఆలస్యం మేమే రివీల్ చేస్తున్నామ్ లెండి.

  1. పూరి జగన్నాథ్ : అవును మన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి సోదరుడు పెట్ల ఉమా శంకర గణేష్ ప్రజంట్ ఏపీ ఎమ్మెల్యే. ఆయన 2019 ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.Puri Brothers
  2. కళ్యాణ్ కృష్ణ కురసాల : సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్ సినిమాలను తీసిన.. కళ్యాణ్ కృష్ణ.. ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకి స్వయానా తమ్ముడు. కురసాల కన్నబాబు 2019 ఎన్నికల్లో  కాకినాడ రూరల్ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేసి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈయన 2009 ఎన్నికల్లో కూడా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలుపొందారు.Kannababu Brothers

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..