Guess The actress: ఈమె ఇలా ఐలవ్యూ చెబితే.. సూర్యుడు కూడా నేలన వాలిపోడా.. తను ఎవరో గుర్తుపట్టారా..?
జీవితంలో ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటోన్న రోజులివీ. ప్రత్యేక సందర్భాన్ని ఇతరులతో పంచుకోవడం అందరికీ ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఇది కేవలం సామాన్యులకు మాత్రమే పరిమితం కాలేదు. సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో..
జీవితంలో ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటోన్న రోజులివీ. ప్రత్యేక సందర్భాన్ని ఇతరులతో పంచుకోవడం అందరికీ ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఇది కేవలం సామాన్యులకు మాత్రమే పరిమితం కాలేదు. సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీలు అంటే అందరికీ అందుబాటులో ఉండరు, వారి విషయాలు అంత సులభంగా తెలియవనే అభిప్రాయాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి తారలే నేరుగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.
కేవలం తమ కెరీర్‌కు సంబంధించిన వివరాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాలు మొదలు విహార యాత్రల వరకు ప్రతీ అంశాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల తార టూర్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. పైన ఫొటోలో నులు వెచ్చని సూర్యకాంతిలో లవ్ సింబల్ చూపిస్తూ ఫొటో దిగిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో తొలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత చిత్రంలో తన క్యూట్ నటనతో కుర్రాళ్ల ఊహల రాణిగా చోటు దక్కించుకుంది. అనంతరం తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
View this post on Instagram
తాజాగా ఓ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? సూర్యుడికి లవ్ సింబల్ చూపిస్తున్న ఈ బ్యూటీ మరెవరో కాదు. అందాల రాశీ.. రాశీ ఖన్నే. అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లో పెద్దగా గ్లామర్ పాత్రల్లో కనిపించని రాశీ ఖన్నా ఇటీవల సోషల్ మీడియా వేదికగా బోల్డ్‌నెస్‌ను పెంచేసింది. బోల్డ్ లుక్స్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఊటీలో సందడి చేస్తోందీ బ్యూటీ. ఫ్రెండ్స్‌తో కలిసి ప్రకృతి రమణీయతల నడుమ ఎంజాయ్ చేస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..