Suhas: ‘ఆ పని చేసినందుకు నా భార్య మూడు రోజులు ఇంటికి రానివ్వలేదు’.. సుహాస్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.

షార్ట్‌ మూవీస్‌ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుహాస్‌. కలర్‌ ఫొటో సినిమాతో హీరోగా మారి తన మార్క్‌ను చూపించుకున్నాడు. ఈ సినిమాలో తనదైన నటనతో మెస్మరైజ్‌ చేశాడు. ప్రేమికుడి పాత్రలో ఎంతో అనుభవం ఉన్న నటుడిగా భావోద్వేగాలను..

Suhas: 'ఆ పని చేసినందుకు నా భార్య మూడు రోజులు ఇంటికి రానివ్వలేదు'.. సుహాస్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.
Suhas Comments
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 24, 2023 | 4:04 PM

షార్ట్‌ మూవీస్‌ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుహాస్‌. కలర్‌ ఫొటో సినిమాతో హీరోగా మారి తన మార్క్‌ను చూపించుకున్నాడు. ఈ సినిమాలో తనదైన నటనతో మెస్మరైజ్‌ చేశాడు. ప్రేమికుడి పాత్రలో ఎంతో అనుభవం ఉన్న నటుడిగా భావోద్వేగాలను పలికించాడు. ఈ సినిమా విజయంలో సుహాస్‌ కీలక పాత్ర పోషించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఓవైపు హీరోగా రాణిస్తున్న సమయంలో హిట్‌2లో నెగిటివ్‌ రోల్‌లో మెప్పించాడు.

అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన హిట్‌-2 మూవీలో సైకో కిల్లర్‌ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అప్పటి వరకు కామెడీతో ఆకట్టుకున్న సుహాస్‌ ఒక్కసారిగా పూర్తిగా నెగిటివ్‌ షేడ్‌లో నటించి ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో పాటు ఓటీటీ వేదికగా విడుదలైన ‘ఫ్యామిలీ డ్రామా’లోనూ సైకో పాత్రలో నటించాడు. ఇదిలా ఉంటే ఈ యంట్ హీరోగా తాజాగా ‘రైటర్ పద్మ భూషణం’గా థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్‌ చిత్రంపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే తాజాగా మీడియాతో ముచ్చటించిన సుహాస్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా సుహాస్‌ మాట్లాడుతూ.. ‘ఫ్యామిలీ డ్రామా’ సిరీస్‌లో సైకోగా నటించాను. ఆ సమయంలో నా వైఫ్ చాలా బయపడింది. మూడు రోజులు ఇంటికి రానివ్వలేదు. ఆఫీసులోనే పడుకున్న. ఇంటికి వెళ్లిన తర్వాత నార్మల్‌గా నవ్వుతున్నా సరే నన్ను చూసి కాస్త భయపడేది’ అంటూ తన భార్యతో జరిగిన విషయాన్ని పంచుకున్నాడు. ఫ్యామిలీ డ్రామాలో ఓవైపు కామెడీ రోల్‌లో కనిపిస్తూనే మరోవైపు సైకోగా నటించి ఆడియన్స్‌ను భయపెట్టిచ్చాడు సుహాస్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..