Tollywood : ఏంటీ.. ఈ హీరో వదిన తొలి ప్రేమ హీరోయినా.. ? ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా తొలి ప్రేమ. ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగులో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కీర్తి రెడ్డి. ఫస్ట్ మూవీ హిట్టైనప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

నటుడు సమ్రాట్ రెడ్డి తెలుగులో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత సహాయ నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్రాట్ రెడ్డి మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులతో తనకున్న సన్నిహిత అనుబంధాల గురించి, ముఖ్యంగా తన అక్కచెల్లెళ్లు శిల్పా రెడ్డి, కీర్తి రెడ్డిల వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాల గురించి వెల్లడించారు. తన కుటుంబమంతా, తల్లిదండ్రులు, అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారని, తన అక్కలు తన పట్ల తల్లితో సమానమైన ప్రేమను, ఆప్యాయతను చూపిస్తారని సమ్రాట్ రెడ్డి తెలిపారు. వారు తన కంటే ఆరు నుండి ఏడు సంవత్సరాలు పెద్దవారని, తన తల్లి తర్వాత వారే తనకి రెండో, మూడో తల్లులని ఆయన అభివర్ణించారు. తన విషయంలో ఎలాంటి శుభవార్త చెప్పినా, వారు ఎమోషనల్ అయిపోతారని, ఆనందభాష్పాలు రాలుస్తారని ఆయన పంచుకున్నారు. చిన్నప్పటి నుండి తమ మధ్య బలమైన బంధం ఉందని సమ్రాట్ రెడ్డి చెప్పారు. తన పెద్ద అక్క ఎక్కువగా ప్రేమను పంచుతుందని, చిన్న అక్క (శిల్పా రెడ్డి) కొంచెం లాజికల్‌గా ఆలోచిస్తుందని, కానీ తనను ఎంతో ప్రేమిస్తుందని సమ్రాట్ వివరించారు.
తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి గురించి ప్రస్తావిస్తూ, ఆమె ప్రస్తుతం వివాహం చేసుకొని, పిల్లలతో సంతోషంగా ఉన్నారని, సినిమాల పట్ల ఆసక్తి చూపడం లేదని సామ్రాట్ రెడ్డి వివరించారు. ఆమె తనకు వదిన అవుతుందని, తెలుగును చాలా చక్కగా మాట్లాడుతుందని, ఆమె నిజామాబాద్ నుండి వచ్చారని తెలిపారు. తొలిప్రేమ చిత్రంతో కీర్తి రెడ్డికి ఇప్పటికీ అభిమానులున్నారని, తెరపై, బయట కూడా ఆమె చాలా అందంగా, ఒక రాణిలా కనిపిస్తారని సమ్రాట్ ప్రశంసించారు. ఆమె కొన్ని చిత్రాలలో సిస్టర్ పాత్రలు చేసిన తర్వాత సినిమాలకు దూరమయ్యారని, అయితే అభిమానులు ఆమె తిరిగి రావాలని కోరుకుంటున్నారని సామ్రాట్ పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
సామ్రాట్ విషయానికి వస్తే.. వినాయకుడు, పంచాక్షరి, దేనికైనా రెడీ, ప్రేమకావాలి, దూసుకెళ్తా వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆకస్మాత్తుగా వెండితెరపై కనిపించడం మానేశాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్నాడు. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూతో మరోసారి వెలుగులోకి వచ్చాడు. ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
