Sai Dharam Tej: ఆసుపత్రిలో కూడా వదిలి పెట్టరా.? సాయి ధరమ్ తేజ్‌ ప్రమాదంపై ఘాటుగా స్పందించిన నిఖిల్‌.

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Sep 14, 2021 | 3:24 PM

Sai Dharam Tej: గత శుక్రవారం రాత్రి సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురైన వార్త దావాలంగా వ్యాపించిన విషయం తెలిసిందే. మెగా హీరో తీవ్ర ప్రమాదానికి...

Sai Dharam Tej: ఆసుపత్రిలో కూడా వదిలి పెట్టరా.? సాయి ధరమ్ తేజ్‌ ప్రమాదంపై ఘాటుగా స్పందించిన నిఖిల్‌.

Follow us on

Sai Dharam Tej: గత శుక్రవారం రాత్రి సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురైన వార్త దావానలంగా వ్యాపించిన విషయం తెలిసిందే. మెగా హీరో తీవ్ర ప్రమాదానికి గురి కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరగగానే తేజ్‌ను మెడికవర్‌కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ సమయంలో తేజ్‌ కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ తారలంతా ఆసుపత్రికి క్యూ కట్టారు. దీంతో మీడియా పెద్ద ఎత్తున ఆ వార్తలను కవర్‌ చేసింది. అయితే ఇదే సమయంలో తేజ్‌కు ఐసీయూలో చికిత్స జరుగుతోన్న సమయంలో కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వీటిలో ‘ఇక్కడ చూడండి.. కళ్లు తెరవండి’ అంటూ వైద్యుడు సాయితేజ్‌ చేతిపై తడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే టాలీవుడ్‌ తాజాగా ఈ వీడియోపై యంగ్‌ హీరో నిఖిల్‌ స్పందించారు. ఒకరి వ్యక్తిగత జీవితానికి ఆ మాత్రం గౌరవం ఇవ్వరా..? అంటూ నిఖిల్‌ ఘూటాగా స్పందించారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతించారు.? సాయి ధరమ్‌ తేజ్‌కు చికిత్స జరుగుతోన్న వీడియో చూడడం చాలా బాధ కలిగించింది. కనీసం ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్నప్పుడైనా ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో కొందరు నిఖిల్‌ అభిమానులు ఆయనకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు.

నిఖిల్ చేసిన ట్వీట్..

Also Read: Pushpa Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్.. పుష్ప మూవీ నుంచి మరో సీన్ లీక్..

PM Modi: అలీఘర్ భారతదేశ సరిహద్దును కాపాడుతుంది.. డిఫెన్స్ కారిడార్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ!

Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ తాజా హెల్త్‌ బులిటెన్‌ వచ్చేసింది.. వైద్యులు ఏమన్నారంటే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu