PM Modi: అలీఘర్ భారతదేశ సరిహద్దును కాపాడుతుంది.. డిఫెన్స్ కారిడార్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ!

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన  అలీఘర్‌లోని డిఫెన్స్ కారిడార్ నోడ్.. రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.

PM Modi: అలీఘర్ భారతదేశ సరిహద్దును కాపాడుతుంది.. డిఫెన్స్ కారిడార్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ!
Pm Modi
Follow us

|

Updated on: Sep 14, 2021 | 3:03 PM

PM MOdi: ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన  అలీఘర్‌లోని డిఫెన్స్ కారిడార్ నోడ్.. రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సమయంలో, ప్రధాని యోగి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ చాలా అభివృద్ధి చెందిందని ప్రధాని అన్నారు. ”దేశం, ప్రపంచంలోని ప్రతి చిన్న, పెద్ద పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తున్నారు. పెట్టుబడికి అవసరమైన వాతావరణం ఏర్పడినపుడు, అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఈ సౌకర్యాలను ప్రజలకు అందించడానికి కేంద్రం, రాష్ట్రంలోని యోగి ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. ఈరోజు  ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ రెట్టింపు లాభానికి గొప్ప ఉదాహరణగా మారుతోంది.” అని ప్రధాని మోడీ చెప్పారు.

మోడీ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవే..

అలీఘర్ భారతదేశ సరిహద్దును కాపాడుతుంది: నిన్నటి వరకు అలీఘర్ ప్రజల ఇళ్లను కాపాడేది. ఇప్పుడు అదే అలీఘర్ భారతదేశ సరిహద్దులను కాపాడుతుంది. రక్షణ ఉత్పత్తులు ఇక్కడ తయారు అవుతాయి. చిన్న ఆయుధాలు, డ్రోన్లు, ఏరోస్పేస్, మెటల్ భాగాలు, రక్షణ ప్యాకేజింగ్ వంటి ఉత్పత్తులు అలీఘర్ నోడ్‌లో తయారు చేస్తారు. దీని కోసం కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి.  100 కోట్లకు పైగా పెట్టుబడి ఉంటుంది. ఈ మార్పు అలీఘర్, పరిసర ప్రాంతానికి కొత్త గుర్తింపును ఇస్తుంది. రక్షణ పరిశ్రమ ద్వారా, ఇక్కడ ఉన్న వర్తకులు, MSME లు కూడా ప్రయోజనం పొందుతాయని మోడీ అన్నారు. పేదలకు ఇది చాలా మంచి అవకాశంగా ఉంటుందని చెప్పారు.

ఇంతకు ముందు పశ్చిమ యూపీ ప్రజలు భయంతో జీవించారు: గతంలో ఉత్తర ప్రదేశ్‌లో పరిపాలన.. పరిపాలన గూండాలు.. మాఫియాలచే ఏకపక్షంగా నడిచేది. ఇప్పుడు దోపిడీదారులు, నడుస్తున్న మాఫియా రాజ్ కటకటాల వెనుక ఉన్నారు. నాలుగు-ఐదు సంవత్సరాల క్రితం, ఈ ప్రాంతంలో తమ సొంత ఇళ్లలో కుటుంబాలు భయంతో నివసించాయని నేను పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రజలకు గుర్తు చేయాలనుకుంటున్నాను.

అప్పట్లో ఆడపిల్లలు  ఇల్లు వదిలి.. పాఠశాల, కళాశాలకు వెళ్లడానికి భయపడ్డారు. కుమార్తెలు ఇంటికి తిరిగి వచ్చే వరకు, తల్లిదండ్రులకు కంటిమీద కునుకు ఉండేది కాదు.  చాలా మంది తమ పూర్వీకుల ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. పారిపోవలసి వచ్చింది. ఈ రోజు ఏదైనా నేరస్థుడు దీన్ని చేయడానికి ముందు 100 సార్లు ఆలోచిస్తాడు. యోగి  ప్రభుత్వంలో, పేదల కోసం పని ఉంటుంది.. పేదల పట్ల గౌరవం ఉంటుంది.

రైతులకు అవకాశాల కొత్త తలుపులు తెరుచుకుంటాయి: చిన్న రైతులకు బలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఒకటిన్నర రెట్లు ఎక్కువ MSP ఇవ్వడం జరుగుతోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాలు మెరుగయ్యాయి. రైతుల ఖాతాలో 6 వేల రూపాయలు ఇస్తున్నారు. అనేక పథకాల ద్వారా రైతులను బలోపేతం చేసింది.

విద్య మరియు ఉపాధిపై: రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయం ఆధునిక విద్యకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. దీనితో పాటు, విద్య, సాంకేతికత, రక్షణకు సంబంధించిన మానవ శక్తి కోసం ఒక కేంద్రం కూడా దేశంలో నిర్మితమవుతుంది. కొత్త విద్యా విధానంలో స్థానిక భాషలో విద్య, నైపుణ్యం, అధ్యయనాలకు ప్రాధాన్యత ఇచ్చిన  విధానం, ఈ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారు. ఈ విశ్వవిద్యాలయం తన సైనిక బలాన్ని బలోపేతం చేసుకోవడానికి స్వయంసమృద్ధి దిశగా పయనించడానికి భారతదేశ ప్రయత్నాలకు ఊతమిస్తుంది. ఇది ఇక్కడి యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభలో  మాట్లాడుతూ.. సహరాన్పూర్‌లో ఒక రాష్ట్ర విశ్వవిద్యాలయం కూడా ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇది రాణి పేరు మీద తెరుస్తారు. ఇది కాకుండా, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరిట మీరట్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంబిన్చానున్నామని చెప్పారు.

రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీకి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది అలీఘర్..చుట్టుపక్కల ఉన్న 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పటి వరకు ఈ విద్యార్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఆగ్రాకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో చదువుతున్నారు. ఇప్పుడు అలీగఢ్‌లో కొత్త యూనివర్సిటీని ప్రారంభించడం వల్ల ఈ విద్యార్థులు అనేక ప్రయోజనాలను పొందుతారు. చిన్న పనుల కోసం విద్యార్థులు ఆగ్రా వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతిపాదన ప్రకారం, రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయంలో అనేక రకాల ప్రొఫెషనల్ కోర్సులుప్రారంభిస్తారు. ప్రస్తుతం 395 కళాశాలలు ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Fact Check: అంతరిక్షంలో తిరుగుతున్న మిస్టరీ శాటిలైట్‌.. నాసా చెప్పిందేమిటంటే..!

Girlfriend: తాగుబోతులకు, తిరుగుబోతులకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. నాకూ కావలి..వెదికి పెట్టమని ఎమ్మెల్యేకు ఓ యువకుడు లెటర్..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..