Pushpa Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్.. పుష్ప మూవీ నుంచి మరో సీన్ లీక్..
Pushpa Movie: ఒకవైపు నుంచి పైరసీ.. మరోవైపు నుంచి లీకులు టాలీవుడ్ ఇండస్ట్రీని ఎంతగా వేధిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న హీరోలతో..
ఒకవైపు నుంచి పైరసీ.. మరోవైపు నుంచి లీకులు టాలీవుడ్ ఇండస్ట్రీని ఎంతగా వేధిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోల చిత్రాలు కూడా లీకుల బారిన పడుతున్నాయి. మొన్నటికి మొన్న ‘సర్కారు వారి పాట’ చిత్రం టీజర్ రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో దర్శనమివ్వగా.. ‘పుష్ప’ మూవీ నుంచి ‘దాక్కో దాక్కో మేక’, ఓ ఫైట్ సీన్ లీక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయా చిత్రాల నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా లీకులు ఆగట్లేదు.
ఇప్పుడు తాజాగా పుష్ప చిత్రం నుంచి మరో సీన్ లీకైనట్లు తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ సీన్ ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప సినిమా కాకినాడలో షూటింగ్ జరుపుకుంటోంది. కీలకమైన ఫైట్ సీన్‌ను కాకినాడలోని పోర్ట్ ఏరియాలో దర్శకుడు సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నారు.
కాగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ప్యాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా పుష్ప మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది.
#Pushpa Shooting spot pic.twitter.com/3JlXM34QeJ
— Bunny_boy_private ? (@iamNarendrra) September 14, 2021
ఇంతకు ముందో టూవీలరూ స్కూటరు మాట్లాడుల్ల నేనూ..
యాపారం చేసే దానికే తిరుపతి నుంచి వచ్చిన్డాం
Ku*** Ramp eh Theatre lo ???? Seat lo Okkaru Kurchoru ??????#Pushpa | @alluarjun #ThaggedheLe ⛏?? pic.twitter.com/dULTrEFIVF
— భవదీయుడు రాజు? (@Thrille32299775) September 14, 2021
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్
కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్