AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya Song: చిరు స్టెప్పులకు అంతా ‘అల్ల కల్లోలం’.. రెజీనాతో డ్యాన్స్‌లో రఫ్ఫాడించిన మెగాస్టార్‌..

Acharya Song: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. 2019లో వచ్చిన 'సైరా నర్సింహా రెడ్డి' తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించని చిరు.. ఆచార్యతో మరోసారి..

Acharya Song: చిరు స్టెప్పులకు అంతా 'అల్ల కల్లోలం'.. రెజీనాతో డ్యాన్స్‌లో రఫ్ఫాడించిన మెగాస్టార్‌..
Acharya Song
Narender Vaitla
|

Updated on: Jan 03, 2022 | 5:56 PM

Share

Acharya Song: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. 2019లో వచ్చిన ‘సైరా నర్సింహా రెడ్డి’ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించని చిరు.. ఆచార్యతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ నటిస్తుండడం, అపజయం అంటూ ఎరగని కొరటాల దర్శకత్వం వహిస్తుండడంతో ‘ఆచార్య’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్‌ లుక్‌, పాటలు ఈ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇక తన సినిమాలో కచ్చితంగా స్పెషల్‌ సాంగ్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకునే కొరటాల ‘ఆచార్య’లోనూ ఉషారు పెంచే ఓ స్పెషల్‌ సాంగ్‌ను కంపోజ్‌ చేయించారు. రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అనే పాట టీజర్‌ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.

ముందుగానే ప్రకటించినట్లు మేకర్స్‌ తాజాగా ఈ పాట ఫుల్‌ లిరికల్‌ వీడియోను సోమవారం విడుదల చేశారు. ‘కల్లోలం.. కల్లోలం.. అల్ల కల్లోలం’ అనే లిరిక్స్‌తో మొదలయ్యే ఈ పాట చిరు అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ ముఖ్యంగా చిరంజీవి ఈ పాటకు వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. డ్యాన్స్‌లకు పెట్టింది పేరైనా చిరు.. ఎన్నేళ్లు అయినా తనలోని స్టామినా ఏ మాత్రం తగ్గలేదన్నట్లు స్టెప్స్‌తో రచ్చ రచ్చ చేశారు. రెజీనాతో పోటీపడీ మరీ కాలు కదిపారు. దీంతో ఈ పాట విడుదల చేసిన కొత్త క్షణాల్లోనే రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటను భాస్కరభట్ల రచించగా.. రేవంత్‌, గీతా మాధురి పాడారు. ఇక సంగీతం దిగ్గజం మణిశర్మ అందించిన ట్యూన్స్‌ ఈ పాటకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. మరి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ సాంగ్‌ లిరికల్‌ వీడియోను మీరూ ఓసారి వినేయండి.

ఇక ఆచార్యం చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా, రామ్‌ చరణ్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Also Read: YS Sharmila: అక్కడ పార్టీ పెట్టకూడదా.. మీడియాతో ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్స్..

AP Schools: ఏపీ ప్రైవేటు స్కూల్స్‌లో పేదలకు 25 శాతం సీట్లు కేటాయింపు.. హైకోర్ట్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో..

GST on Footwear: చీప్ లిక్కర్ కాదు చెప్పుల ధరలు తగ్గించండి.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీపీఐ నారాయణ..

పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెబుతాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెబుతాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
శాఖాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎక్కువ ఎందుకో తెలుసా?
శాఖాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎక్కువ ఎందుకో తెలుసా?
'కులం చుట్టూ తిరిగే.. హార్డ్‌ హిట్టింగ్ సినిమా ఇది'
'కులం చుట్టూ తిరిగే.. హార్డ్‌ హిట్టింగ్ సినిమా ఇది'
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!