బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌పై ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పడింది. ప్రభాస్ చిత్రానికి సంబంధించి వచ్చే ఏ చిన్న అప్‌డేట్ అయినా ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అవ్వాల్సిందే. ప్రస్తుతం యావత్ ఇండిమా ఇండస్ట్రీ దృష్టి ప్రాజెక్ట్-కే పై పడింది. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికాతో పాటు, అమితాబ్ బచన్ నటిస్తుండడంతో నేషనల్ వైడ్‌గా ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోయినా సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్ట్ కే చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్లు సమాచారం. కథ నిడివి పెద్దగా ఉండడంతో చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై నాగ అశ్విన్ ప్రభాస్‌తో చర్చించగా దానికి ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పార్ట్ 1ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి పార్ట్‌కు సంబంధించి షూటింగ్ పూర్తికాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ, సాంకేతిక హంగులతో సినిమాను చిత్రీకరించిన నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..