AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli – Mahesh: రాజమౌళి, మహేష్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. ఖుషీ అవుతోన్న బాలయ్య ఫ్యాన్స్‌..

Rajamouli - Mahesh: రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్‌ (RRR) సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 4 ఏళ్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌తో సావాసం చేసిన రాజమౌళి బాధ్యత మార్చి 25తో తీరనుంది. దీంతో తన తదుపరి సినిమా (Rajamouli Next Movie)పై ఇప్పటి నుంచే అందరిలోనూ ఆసక్తి..

Rajamouli - Mahesh: రాజమౌళి, మహేష్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. ఖుషీ అవుతోన్న బాలయ్య ఫ్యాన్స్‌..
Mahesh Rajamouli
Narender Vaitla
|

Updated on: Mar 12, 2022 | 9:13 AM

Share

Rajamouli – Mahesh: రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్‌ (RRR) సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 4 ఏళ్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌తో సావాసం చేసిన రాజమౌళి బాధ్యత మార్చి 25తో తీరనుంది. దీంతో తన తదుపరి సినిమా (Rajamouli Next Movie)పై ఇప్పటి నుంచే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రాజమౌళి టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు (Mahesh Babu)తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి తర్వాతి సినిమాపై వార్తలు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

ఈ చిత్రానికి సంబంధించి రైటర్‌ విజయేంద్ర వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా ఆఫ్రికా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఉండనుందని చేసిన ప్రకటనతో సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న మహేష్‌ ఆ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్‌తో మొదలు పెట్టనున్నారు. ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడం లేదా, ఒక కాలంలో రాజమౌళి సినిమాలో నటించనున్నారా తెలియాల్సి ఉంది.

Balakrishna

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఈ వార్త ప్రకారం మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న సినిమాలో నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కేవలం గెస్ట్ రోల్‌కే పరిమితం కాదని సినిమాలో సుమారు 20 నిమిషాలకుపై బాలయ్య కనిపించనున్నారని సమాచారం. దీంతో ఈ వార్త తెలిసిన బాలయ్య ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోను రాజమౌళి దర్శకత్వంలో చూసుకోవచ్చని తెగ మురిసిపోతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Spider Man No Way Home: ఓటీటీలో సందడి చేయనున్న స్పైడర్‌మ్యాన్‌ నో వే హోమ్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి అన్నీ సానుకూల ఫలితాలే.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ట్రెండీ లుక్ లో చిన్నది.. మాళవిక మోహనన్ ఫోటోస్ వైరల్

Follow Us
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?