AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి అన్నీ సానుకూల ఫలితాలే.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (12-03-2022): మనలో చాలా మంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని ... మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి అన్నీ సానుకూల ఫలితాలే.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Mar 12, 2022 | 6:32 AM

Share

Horoscope Today (12-03-2022): మనలో  చాలా మంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని …  మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 12వ తేదీ ) శనివారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అంచనాలను అందుకుంటారు.  స్నేహితులు, బంధువులతో విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ పాల్గొంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ఉత్సాహంగా పనిచేయాల్సి ఉంటుంది. బంధు, మిత్రుల సహకారంతో చేపట్టిన పనులు ప్రారంభిస్తారు. సకాలంలో వాటిని పూర్తి చేసేవారు.  వృధా ఖర్చులు చేస్తారు. సమయానికి తగిన ఆహారం, నిద్ర తప్పనిసరి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు  అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. మానసిక బలంతో చేపట్టిన పనుల్లో ఫలితాలను అందుకోవాల్సి ఉంటుంది.  బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ధాన్య వృద్ధి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి.  సంతోషాన్ని కలిగించే వార్త వింటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా చూసుకోవాలి. పని తీరుతో అధికారుల మన్నన పొందుతారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శ్రమకు తగిన గుర్తింపు అందుకుంటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో సానుకూల పరిస్థితులు ఉండకపోవచ్చు. ప్రారంభ పనుల్లో ఆటంకాలు ఏర్పడినా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా ఆందోళన కలిగించే విషయాలు చోటు చేసుకుంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో సంతోషకరంగా గడుపుతారు. మానసిక ఆనందాన్ని పొందుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక పనుల్లో శుభ ఫలితాలు అందుకుంటారు.  చేపట్టిన పనులు సమర్ధవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి  విందు, వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలగ కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయా రంగాల్లో ఉన్నవారు  సమయానుకూలంగా ముందుకు సాగితే సత్పలితాలు అందుకుంటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు  చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో  . సమస్యగా అనిపించినా చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

కొన్ని విషయాలు క్షణికానందాన్ని ఇస్తాయి.. వాటిని చూసి పొంగిపోకూడదు అంటున్న చాణక్య

పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్