AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దెయ్యానికి ‘అవెంజర్స్’ దెబ్బ..!

హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ దెబ్బకు మే 1న తెలుగులో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్  సురవరం’ సినిమాను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రభుదేవా, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అభినేత్రి 2’ విడుదల కూడా వాయిదాపడింది. అభినేత్రి కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ముందుగా మే 1న విడుదలకానుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగుతో పాటు […]

దెయ్యానికి 'అవెంజర్స్' దెబ్బ..!
Ravi Kiran
|

Updated on: Apr 27, 2019 | 4:12 PM

Share

హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ దెబ్బకు మే 1న తెలుగులో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్  సురవరం’ సినిమాను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రభుదేవా, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అభినేత్రి 2’ విడుదల కూడా వాయిదాపడింది. అభినేత్రి కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ముందుగా మే 1న విడుదలకానుందని ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో మే 31న విడుదల చేయనున్నారు. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. కాగా తెలుగులో ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ విడుదల చేయనుంది.

Follow Us