మహేష్ సినిమాకు ఎన్టీఆర్ టైటిల్..?
‘ఎఫ్2’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. దివంగత ఎన్టీఆర్ నటించిన కంచుకోట సినిమాలోని ఎవర్ గ్రీన్ సాంగ్ పల్లవిలోని మొదటి లైన్ ఇది. ఇప్పుడు ఈ […]

‘ఎఫ్2’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. దివంగత ఎన్టీఆర్ నటించిన కంచుకోట సినిమాలోని ఎవర్ గ్రీన్ సాంగ్ పల్లవిలోని మొదటి లైన్ ఇది. ఇప్పుడు ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాకు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారో లేదో వేచి చూడాలి.
రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ గా కనిపించనున్నాడు. దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




