AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డుల ‘బాహుబలి’

అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా.. రెండు రోజుల్లోనే 2130 కోట్లు రాబట్టింది. సినిమా రిలీజైన తొలి రోజే 1186 కోట్లు వ‌సూళ్ళు చేసిన‌ట్లు సినీ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ ప్రివ్యూ కూడా పాత రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. స్టార్‌వార్స్ పేరిట ఉన్న ప్రివ్యూ రికార్డును ఎండ్‌గేమ్ తిర‌గ‌రాసింది. దుష్ట‌శ‌క్తి థానోస్‌ను అంతం చేయాల‌న్న దీక్ష‌తో సూప‌ర్‌హీరోస్ అంతా ఒక్క‌టై ఈ విశ్వాన్ని ర‌క్షిస్తారు. ఆ క‌థాంశంతోనే […]

రికార్డుల 'బాహుబలి'
Ravi Kiran
|

Updated on: Apr 27, 2019 | 4:04 PM

Share

అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా.. రెండు రోజుల్లోనే 2130 కోట్లు రాబట్టింది. సినిమా రిలీజైన తొలి రోజే 1186 కోట్లు వ‌సూళ్ళు చేసిన‌ట్లు సినీ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ ప్రివ్యూ కూడా పాత రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. స్టార్‌వార్స్ పేరిట ఉన్న ప్రివ్యూ రికార్డును ఎండ్‌గేమ్ తిర‌గ‌రాసింది. దుష్ట‌శ‌క్తి థానోస్‌ను అంతం చేయాల‌న్న దీక్ష‌తో సూప‌ర్‌హీరోస్ అంతా ఒక్క‌టై ఈ విశ్వాన్ని ర‌క్షిస్తారు. ఆ క‌థాంశంతోనే అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్‌ను రూపొందించారు. రెండు రోజుల్లోనే రెండు వేల కోట్లు వ‌సూళ్ళు చేసిన‌ట్లు డెడ్‌లైన్ వెబ్‌సైట్‌ పేర్కొంది. మొత్తం 46 దేశాల్లో ఈ సినిమా రిలీజైంది. మ‌న దేశంలోనూ శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌లైంది. అయితే చైనాలో ఈ సినిమా రెండు రోజుల ముందే రిలీజైంది. అక్క‌డ 1075 కోట్లు వ‌సూళ్ళు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆంథోనీ, జో రూసోలు ఈ సినిమాను డైర‌క్ట్ చేశారు. క్రిస్టోఫ‌ర్ మార్క‌స్‌, స్టీఫెన్ మాక్‌ఫీలేలు స్క్రిప్ట్ అందించారు.

అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ హ‌వా ఇండియాలోనూ కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే టిక్కెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు 51.25 కోట్ల వ‌సూళ్ళు చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్ర జోరు టాలీవుడ్ సినిమాల‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది. జెర్సీ, మ‌జిలీ, కాంచ‌న 3, చిత్రల‌హ‌రి చిత్రాలు మంచి టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా న‌డుస్తుండ‌గా, అవెంజ‌ర్స్ సృష్టిస్తున్న తుఫానుకి తెలుగు చిత్రాల కలెక్ష‌న్స్ కాస్త త‌గ్గాయి.