రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు.. మహిళ దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద వేగంగా వెళ్తున్న హీరో సుధాకర్ కోమకుల కారు.. జాతీయ రహదారిపై మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాధితురాలు అక్కడిక్కడే చనిపోయింది. హీరోకు గాయాలయ్యాయి. కాగా హరినాథ్ బాబు దర్శకత్వంలో సుధాకర్ నువ్వు తోపు రా అనే సినిమాలో సుధాకర్ నటించాడు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు […]

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు.. మహిళ దుర్మరణం
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2019 | 3:07 PM

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద వేగంగా వెళ్తున్న హీరో సుధాకర్ కోమకుల కారు.. జాతీయ రహదారిపై మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాధితురాలు అక్కడిక్కడే చనిపోయింది. హీరోకు గాయాలయ్యాయి.

కాగా హరినాథ్ బాబు దర్శకత్వంలో సుధాకర్ నువ్వు తోపు రా అనే సినిమాలో సుధాకర్ నటించాడు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు వెళ్తోన్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.