West Bengal Election 2021: బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై బాంబు దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం.. మరికొంత మందికి..

Six BJP workers injured in West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతుండటంతో ఎప్పుడు..

West Bengal Election 2021: బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై బాంబు దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం.. మరికొంత మందికి..
Six BJP workers injured in a crude bomb blast
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 06, 2021 | 12:05 PM

Six BJP workers injured in West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతుండటంతో ఎప్పుడు ఎం జరుగుతుందోనంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా బెంగాల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ కార్యకర్తలపై బాంబుతో దాడి చేశారు. రాష్ట్రంలోని ద‌క్షిణ 24 ప‌ర‌గ‌ణ జిల్లాలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి క్రూడ్ బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి త‌ర‌లించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యకర్తల బృందం శుక్రవారం అర్ధరాత్రి పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. అయితే అధికార తృణమూల్ పార్టీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో 8 విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికలు మార్చి 27న.. చివరి విడుత ఏప్రిల్‌ 29న జరుగనున్నాయి. పోలింగ్‌ తేదీలు: తొలి విడత: మార్చి 27 రెండో విడత: ఏప్రిల్‌ 1 మూడో విడత: ఏప్రిల్‌ 6 నాలుగో విడత: ఏప్రిల్‌ 10 ఐదో విడత: ఏప్రిల్‌ 17 ఆరో విడత: ఏప్రిల్ 22 ఏడో విడత: ఏప్రిల్ 26 ఎనిమిదో విడత: ఏప్రిల్ 29

Also Read:

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు

ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..

టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...

మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..